మహానటికి ఘన నివాళి.. విద్యార్థుల ప్రతిభ అద్భుతం
తెలుగు ప్రేక్షకుల మదిలో మెదిలే అందాల తార మహానటి సావిత్రికి క్రియేటివ్ మల్టీ మీడియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. దిల్‌షుక్ నగర్‌లోని కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వినూత్నంగా సావిత్రి చిత్రాలతో ఏర్పాటు చేసి ఆర్ట్ గ్యాలరీ విశేషంగా ఆకర్షించింది.
క్రియేటివ్ మల్టీ మీడియా విద్యార్థులు వేసిన పెన్సిల్ స్కెచ్‌లు, పెయింటింగ్‌లు, నైరూప్య చిత్రాలు అతిథులు, అభిమానులు, సందర్శకులకు కొత్త అనుభూతిని కలుగజేశాయి. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహానటి దర్శకుడు నాగ అశ్విన్, నిర్మాతలు స్వప్నాదత్, ప్రియాంకా దత్, హీరో శ్రీకాంత్, మా అధ్యక్షుడు తదితరులు హాజరయ్యారు.
మహానటి చిత్రం స్ఫూర్తితో సావిత్రి చిత్రాలను అద్బుతంగా రూపొందించిన విద్యార్థులను మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా కొనియాడారు. జీవితంలో ఆమె పోరాటం, ఓటమిని అంగీకరించలేని మనస్థత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. చిత్రాల అమ్మకం ద్వారా వచ్చిన రూ.3 లక్షల రూపాయలను మా అసోసియేషన్‌కు విరాళంగా ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.

మహానటి నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్ మాట్లాడుతూ.. మహానటి చిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన, ప్రశంసలు లభించాయి. ఈ రోజు నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో చిత్రాలు విద్యార్థుల ప్రతిభకు అద్దం పడుతున్నాయి అన్నారు.

నాగ అశ్విన్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. మొదటి సంవత్సరం విద్యార్థుల అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. వీరందరికీ చక్కని భవిష్యత్ ఉంది అని అన్నారు.

క్రియేటివ్ మల్టీ మీడియా కాలేజ్ ప్రసిడెంట్ రాజశేఖర్ బుగ్గటి మాట్లాడుతూ.. గ్యాలరీ సందర్శనకు వచ్చిన ప్రతీ ఒక్కరికి, కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ప్రోత్సహించిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications











