twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వారు ఉంటారు.. వారికి అదే గొప్ప సంతృప్తి.. రియల్ హీరోపై మెగాస్టార్ ప్రశంసలు

    |

    ఎవరికైనా సరే పనే దైవం. పనిని దైవంగా భావించిన వారికే విజయం వరిస్తుంది. చేసే పనిని ప్రేమతో చేసిన వారెవరైనా సరే శిఖరాగ్రానికి చేరుతారు. చేసే పని ఏదైనా సరే ఇష్టంగా చేయాలి కష్టంగా కాదని అందుకే పెద్దలు అంటుంటారు. ఓ వ్యక్తి తన వృత్తి కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్నాడు. రిటైర్డ్ అయ్యే వరకు తన జీవితాన్ని వృత్తికే అంకితం చేశాడు. అంతటి గొప్ప వ్యక్తిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించాడు.

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెటైర్లు వేయడంలో చిరు తరువాతే ఎవ్వరైనా. ఆ మధ్య ట్విట్టర్‌ను దడదడలాడించేశాడు. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న చిరు తాజాగా ఓ ట్వీట్ చేశాడు. ఓ రియల్ హీరోపై ప్రశంసలు కురిపించాడు.

    వృత్తిపై ప్రేమ..

    వృత్తిపై ప్రేమ..


    తమిళనాడులోని కూనూర్ అనే అటవీ ప్రాంతంలో శివన్ పోస్ట్ మ్యాన్‌గా పని చేస్తూ ఉండేవాడు. ఆయన సరైన సమయానికి ఉత్తరాలను అందించేందుకు వాగులు, వంకలు, గుట్టలు, వన్య మృగాలను దాటుకుంటూ రోజూ 15 కిలోమిటర్లు ఆ ఆటవీ ప్రాంతంలోనే నడుచుకుంటూ వెళ్లేవారట. ఆయన రీసెంట్‌గా రిటైర్ అయ్యారట. చివరకు వరకు తన వృత్తి పట్ల ఎంతో ప్రేమను చూపించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

    మెగాస్టార్ స్పందన..

    మెగాస్టార్ స్పందన..

    ఆ పోస్ట్ మ్యాన్‌కు సంబంధించిన వివరాలను సుప్రియ సాహు అనే ఐఏఎస్ ఆఫీసర్ సోషల్ మీడయాలో షేర్ చేయగా మెగాస్టార్ స్పందించాడు. ‘అలా జరగడానికి అవకాశం ఉంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తమ పనిని చేయడంలోనే చాలా మందికి సంతృప్తి ఉంటుంది. అటువంటి గొప్ప మానవులకు ధన్యవాదాలు, మానవత్వం వృద్ధిచెందాలి.. వీరు ప్రపంచానికి తెలియన హీరోలు' అంటూ ప్రశంసలు కురిపించారు.

    Recommended Video

    Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
    గతంలోనే ఇలాగే..

    గతంలోనే ఇలాగే..

    మెగాస్టార్ చిరంజీవికి ఎవ్వరైనా సరే మంచి పనులు చేస్తూ ఉంటే ప్రోత్సహించడం అలవాటు. లాక్ డౌన్ సమయంలో ఓ వృద్దురాలికి గోరు ముద్దలు తినిపించిన ఒడిశా మహిళా పోలీస్ అధికారిణి సుభా శ్రీని అభినందించాడు. వాటికి సంబంధించిన వీడియోలు అప్పట్లో తెగ వైరలైన సంగతి అందరికీ తెలిసిందే.

    English summary
    Chiranjeevi Praises coonoor postman sivan. Chanced upon this.For many people, doing their job despite all adversities gives utmost satisfaction.Thanks to such great beings, humanity thrives. UnsungHeroes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X