DadaSaheb Phalke Film Festival Awards షారుక్ - నయనతార - సందీప్ వంగాకు ప్రతిష్టాత్మక అవార్డ్స్

చిత్రసీమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌) ముంబయిలో గ్రాండ్​గా జరిగింది. ఈ పురస్కార వేడుకలో పలువురు బడా సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. అవార్డులను అందుకున్నారు. దాని గురించే ఈ కథనం..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పురస్కారాల్లో దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- కూడా ఒకటి. తాజాగా డీపీఐఎఫ్‌ఎఫ్‌ 2024 ముంబయిలో గ్రాండ్​గా జరిగింది. మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఈ పురస్కార వేడుకలో పలువురు బడా సినీ తారలు విచ్చేసి సందడి సందడి చేశారు.

DadaSaheb Phalke International Film Festival Awards Winners 2024 List Here

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు. అనంతరం ముచ్చటిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వాటికి సంబంధించిన ఫొటోలను వీడియోలను దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సోషల్ మీడియాలో అఫీషియల్​గా పోస్ట్ చేశారు. దీంతో అవి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన అభిమానులు, ప్రేక్షకులు సంతోషంతో వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఆ నలుగురు ప్రత్యేకంగా : గతేడాది 2023 డిసెంబర్‌లో విడుదలై ఇండియన్​ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లతో సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అందుకున్న చిత్రం యానిమల్‌. ఈ సినిమాకు రెండు అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి ఫేమ్​ సందీప్‌ వంగాకు బెస్ట్ డైరెక్టర్​గా పురస్కారం లభించింది. సినిమాలు విలన్​గా నటించిన స్టార్​ యాక్టర్​ బాబీ దేఓల్​కు నెగటివ్​ రోల్​లో ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది.

అలాగే తమిళ స్టార్ డైరెక్టర్​ అట్లీ రూపొందించిన జవాన్​ సినిమా భారీ స్థాయిలో దాదాపు రూ.1000కోట్ల వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా ద్విపాత్రాభినయంలో కనిపించిన షారుక్ ఖాన్​కు బెస్ట్ యాక్టర్​గా, హీరోయిన్​గా నటించిన నయనతారకు ఉత్తమ నటి అవార్డులు వరించాయి. అలా ఈ నలుగురు వేడుకలో మరింత ప్రత్యేకంగా నిలిచారు.

విజేతలు వీరే..

ఉత్తమ నటుడు - షారుక్ ఖాన్(జవాన్)
ఉత్తమ నటి - నయనతార(జవాన్)
ఉత్తమ నటుడు (నెగెటివ్‌ రోల్‌)- బాబీ దేవోల్‌ (యానిమల్‌)
క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు - విక్కీ కౌశల్‌ ( సామ్‌ బహదూర్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు - అనిరుధ్‌ రవిచందర్‌
ఉత్తమ గీత రచయిత - జావేద్‌ అక్తర్‌ ( నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ)
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ ( Female) - శిల్పా రావు
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (Male) - వరుణ్‌ జైన్‌
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ - యేసుదాసు

టెలివిజన్‌ విభాగం
ఉత్తమ నటుడు - నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌)
టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌ - ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌
ఉత్తమ నటి - రూపాలీ గంగూలీ (అనుపమ)

వెబ్‌సిరీస్‌ విభాగం
క్రిటిక్స్‌ ఉత్తమ నటి - కరిష్మా తన్నా (స్కూప్‌)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X