మెగా ‘డాటర్స్ డే’.. నాగబాబు అలా చిరు ఇలా.. అల్లు ఫ్యామిలీ అదుర్స్!!
ఇంటర్నేషనల్ డాటర్స్ డే నేడు (సెప్టెంబర్ 27). ఈ సందర్భంగా కూతుళ్లపై ఎంతటి ప్రేమ ఉందో కనబరుస్తున్నారు సెలెబ్రిటీలు. టాలీవుడ్, బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా తారలంతా తమ కూతుళ్లపై ఉన్న ప్రేమను చాటిచెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మెగా డాటర్స్ డే జరిగినట్టు అనిపిస్తోంది. మెగా డాటర్ల స్పెషల్ ఫోటోలన్నీ వైరల్ అవుతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ఉదయం షేర్ చేసిన ఫోటోలు ఎంతగానే వైరల్ అయ్యాయి.

ఆ దెయ్యాలే కూతుళ్లు..
‘మనం కలలుగనే చిట్టి దెయ్యాలో కూతుళ్ల రూపంలో ఈ భూమ్మీదకు వస్తారు.. నవ్వించేందుకు, ఏడిపించేందుకు, ఆట పట్టించేందుకు, చిరాకు పుట్టించేందుకు, ప్రేమలో పడేసేందుకు మన కోసం వస్తారు. హ్యాపీ డాటర్స్ డే టు మై డ్రీమ్ డెవిల్.. ఈ భూమ్మీద ఉన్న ప్రతీ దెయ్యానికి కూడా డాటర్స్ డే శుభాకాంక్షలు అంటూ నాగబాబు నిహారికపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అంతేకాకుండా నేటి సాయంత్రం ఏడు గంటలకు లైవ్‌లోకి వచ్చి ఈ తండ్రీ కూతుళ్లు సందడి చేశారు.

చిరు అలా..
చిరంజీవి ఇక లేటుగా విషెస్ చెప్పాడు. కానీ ట్రెండీగా లేటెస్ట్‌గా చెప్పాడు. మాటలేవీ లేకుండా కేవలం ఒకే ఒక సింబల్‌తో వర్ణించేశారు. తన కూతుళ్లు ఇంద్ర ధనస్సుల్లాంటి వారు అన్ని రంగులుంటేనే బాగుంటుందని సింబాలిక్ చెప్పి తన కూతుళ్లతో దిగిన అందమైన ఫోటోను షేర్ చేశాడు చిరంజీవి. జీవితాల్లో వెలుగులు నింపేవారే డాటర్స్.. వారు మన జీవితంలో తెచ్చే ఆనందం గురించి మాటల్లో వర్ణించలేమని చిరు అన్నాడు.

అల్లు ఫ్యామిలీ అదుర్స్..
ఇక అల్లు అర్జున్ మొదటగా అర్హతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. కూతుర్లంటే స్వర్గం నుంచి ఈ భూమ్మీదకు దిగి వచ్చిన దేవ దూతలు అంటూ ఎంతో గొప్పగా చెప్పాడు. ఆపై తన సోదరుడు అల్లు బాబీ కూతురితో దిగిన ఫోటోనూ కూడా షేర్ చేశాడు.
Recommended Video

అల్లు శిరిష్ కొటేషన్..
ఇక అల్లు శిరీష్, బన్నీతో కలిసి అల్లు బాబీ డాటర్‌ను ముద్దు పెట్టుకున్నారు. ఈ ఇద్దరి ముద్దులో మునిగిన అన్వీని ఐరీష్ కొటేషన్‌తో వివరించాడు అల్లు శిరీష్. భార్య వచ్చే వరకు మాత్రమే ఒక కొడుకు కొడుకులా ఉంటాడు.. అదే కూతురు అయితే తన జీవితాంతం కూతురులానే ఉంటుందని తెలిపాడు. నువ్వే నా మొదటి బేబివి అన్వీ తల్లీ అంటూ ప్రేమను కురిపించాడు.


Click it and Unblock the Notifications











