ఎన్టీఆర్‌కు ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్పెషల్ గిప్ట్.. భార్యతో కలిసి సర్‌ప్రైజ్ చేశాడు

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఆల్‌రౌండర్‌గా గుర్తింపు సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్‌తో అగ్ర హీరోగా ఎదిగాడు. టీనేజ్‌లోనే ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు... సింగిల్ టేక్ యాక్టర్‌గా పేరొందాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇదిలాఉండగా.. బుధవారం (మే 20) తారక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ అతడికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటో మీరే చూడండి.!

Recommended Video

#HappyBirthdayNTR : Australia Cricketer David Warner's Special Gift To Jr.NTR On His Birthday!
అరుదైన ఘనతను సొతం చేసుకున్న ఎన్టీఆర్

అరుదైన ఘనతను సొతం చేసుకున్న ఎన్టీఆర్

కొన్నేళ్లుగా వరుస విజయాలతో మాంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్' నుంచి మొదలుకొని అతడు ఏకంగా ఐదు విజయాలను అందుకున్నాడు. దీంతో డబుల్ హ్యాట్రిక్‌కు చేరువచ్చాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా ఇన్ని హిట్లను అందుకున్న హీరోలు లేకపోవడం గమనార్హం.

పాన్ ఇండియా ప్రాజెక్టులతో తారక్ ఫుల్ బిజీ

పాన్ ఇండియా ప్రాజెక్టులతో తారక్ ఫుల్ బిజీ

ప్రస్తుతం ఎన్టీఆర్... దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అతడు కొమరం భీంగా కనిపించనున్నాడు. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తాడు. అది పూర్తయిన వెంటనే ‘KGF' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పాన్ ఇండియా మూవీలో కావడం విశేషం.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

జూనియర్‌ ఎన్టీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. బుధవారంతో అతడు 37వ వసంతంలోకి అడుగు పెట్టాడు. దీంతో తారక్‌కు సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామిక రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు ఎంతో మంది అతడికి విసెష్ చెబుతున్నారు.

ఫ్యాన్స్ హంగామా.. చరిత్ర సృష్టించారు

తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హడావిడి ప్రారంభించేశారు. మరీ ముఖ్యంగా #happybirthdayntr అనే హ్యాష్ ట్యాగ్‌తో చరిత్ర సృష్టించారు. ఈ ట్యాగ్ ద్వారా మే 19 సాయంత్ర ఆరు గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు 15.6 మిలియన్స్ ట్వీట్స్ వచ్చాయి.

ఎన్టీఆర్‌కు ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్పెషల్ గిప్ట్

కొద్ది రోజులుగా తెలుగు పాటలు, డైలాగులపై టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అలరిస్తున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్'లోని పక్కా లోకల్ అనే పాటకు భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో చేస్తున్నట్లు అతడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఫ్యాన్ కోరితే ట్వీట్.. ఆ తర్వాత డ్యాన్స్

ఫ్యాన్ కోరితే ట్వీట్.. ఆ తర్వాత డ్యాన్స్

వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పమని ఓ అభిమాని వార్నర్‌‌ను ట్విట్టర్ వేదికగా కోరాడు. దానికి వెంటనే స్పందించిన డేవిడ్.. ‘హ్యాపీ బర్త్‌డే బడ్డీ' అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో కానీ, ఏకంగా ఎన్టీఆర్ పాటకే డ్యాన్స్ వేసి దాన్ని పోస్ట్ చేశాడు. దీంతో తారక్ అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X