దావూద్ ఇబ్రహీం బండారం బయటపెట్టిన లవర్.. ప్రియాంక చోప్రా, షారుక్‌పై నోటి దురుసు
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ప్రేయసి అంటూ వెలుగులోకి రావడంతో పాకిస్థాన్ నటి మెహ్వీష్ హయత్ పేరు మీడియాలో చర్చనీయాంశమైంది. దీంతో మెహ్వీష్ ఎవరు? ఏమిటనే విషయంపై తన గతాన్ని తవ్వడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్‌పై నోరు పారేసుకొన్న సందర్బాలను మీడియాలో కథనాలు వస్తున్నాయి. మెహ్వీష్ నోటి దురుసు, వ్యక్తిగత జీవితం గురించి డీఎన్ఏ బయటపెట్టిన విషయాలు ఇవే...

బలమైన సినీ కుటుంబ నేపథ్యం
పాకిస్థాన్ నటి మెహ్వీష్ హయత్‌కు సినీ కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె తల్లి రుష్కర్ హయత్‌కు టెలివిజన్ నటిగా అత్యంత ప్రేక్షకదారణ ఉంది. ఆమె సోదరుడు జీషన్ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్. అలాగే సోదరి అఫ్సీన్ కూడా గాయకురాలే. అలాగే అన్నయ్య డానిష్ హయత్ నటుడు, వదిన మోడల్. ఇలా పాక్ సినిమా పరిశ్రమతో మెహ్వీష్ బలమైన సంబంధాలు ఉన్నాయి. అయినా తన ప్రతిభను చాటుకోలేకపోయింది.

దావూద్ లింకుతో భారీ ఆఫర్లు
తన కుటుంబానికి పాక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని సినీ, టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. పదేళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. పేరు సంపాదించుకోలేకపోయింది. చివరకు దావూద్ ఇబ్రహీంతో అఫైర్ కారణంగా ఇండస్ట్రీలో భారీ ఆఫర్లను సంపాదించుకొన్నదనే వాదన తెరపైకి వచ్చింది. కరాచీలో తనకు ఉన్న పట్టుతో మెహ్వీష్‌కు దావూద్ భారీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాన్ని కల్పించినట్టు సమాచారం.

ప్రియాంక చోప్రాపై మెహ్వీన్ అనుచిత వ్యాఖ్యలు
పుల్వామా దాడుల నేపథ్యంలో జరిగిన బాలాకోట్ దాడులను ఉద్దేశించి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జై హింద్ అంటూ చేసిన ట్వీట్‌పై తన నోటి దురుసును బయటపెట్టుకొన్నది. ఐక్యరాజ్య సమతి గుడ్‌విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ యుద్ధాన్ని ప్రోత్సాహిస్తున్నదంటూ తన బ్లాగ్‌లో కామెంట్లు చేయడం వివాదంగా మారింది. దేశ భక్తి ముసుగులో మతాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.

షారుక్ ఖాన్‌పై మతపరమైన కామెంట్లు
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ నటించిన బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ను షారుక్ ఖాన్ ప్రమోట్ చేయడంపై మెహ్వీష్ హయత్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా రూపొందిన ప్రాజెక్ట్‌ను షారుక్ ప్రమోట్ చేస్తున్నారు. ఇస్లాం మతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకొన్నది.
Recommended Video

లవర్ కారణంగా దావూద్‌లో గుబులు
ఇదిలా ఉండగా, మెహ్వీష్ హయత్‌తో తన సన్నిహిత సంబంధాలను డీఎన్ఏ బయట పెట్టడంపై దావూద్ ఇబ్రహీ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తన కంటే 27 వయసులో చిన్నదానితో సంబంధాలు పెట్టుకోవడమనే విషయం భారత్ మీడియాకు ఎలా పొక్కిందనే అంశంపై దావూద్ ఆరా తీస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











