PV Sindhu తో దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అలా.. సోషల్ మీడియాలో జోరుగా రూమర్లు

బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ అభిమానులకు సంతోషంలో ముంచెత్తారు. పీవీ సింధు, దీపిక కలుసుకోవడం పక్కన పెడితే.. వారిద్దరూ బాడ్మింటన్ ఆట ఆడి అభిమానులు ఆనందానికి గురిచేశారు. దీపిక, పీవీ సింధూ ఆటకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

వాస్తవానికి దీపిక పదుకోన్‌కు బాడ్మింటన్‌కు అవినాభవ సంబంధం ఉంది. దీపిక పదుకోన్ తండ్రి ప్రకాశ్ పదుకోన్ బాడ్మింటన్ క్రీడలతో లెజెండ్ అనే సంగతి తెలిసిందే. బాడ్మింటన్ క్రీడతో దీపిక పదుకోన్‌కు అలాంటి అనుబంధం ఉంది. అయితే తాజాగా పీవీ సింధును దీపిక పదుకోన్ దంపతులు ఆత్మీయంగా కలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరు బాడ్మింటన్ మ్యాచ్ ఆడి ఒకరికొకరు తలపడ్డారు. బాడ్మింటన్ కోర్టులో పీవీ సింధూ, దీపిక మధ్య ఆనందమైన క్షణాలు కనిపించాయి. ఆ తర్వాత వారిద్దరూ తమ ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వారిద్దరి ఫోటోలపై భారీగా కామెంట్లు, లైకులు వచ్చాయి

Deepika Padukone played badminton with PV Sindhu

బాడ్మింటన్ మ్యాచ్ సందర్భంగా దీపిక నల్లటి దుస్తుల్లో కనిపించారు. ట్రాక్ ప్యాంట, టాప్ వేసుకొని ఆటలోకి దిగారు. సిందూ పర్బుల్, పింక్ టాప్, ట్రాక్ వేసుకొన్నారు. అయితే వీడియోను, ఫోటోలు షేర్ చేసి దీపిక పదుకోన్ వర్సెస్ పీవీ సింధు అని ట్యాగ్ చేశారు.

నా జీవితంలో ఇది రెగ్యలర్ డే.. పీవీ సింధుతో బాడ్మింటన్ ఆడి కేలరీలు కరిగించాను అని దీపిక పదుకోన్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. Ramleela అని హ్యాష్ ట్యాగ్ షేర్ చేశారు. పీవీ సింధుతో, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి దిగిన ఫోటోను దీపిక పదుకోన్ షేర్ చేశారు.

Deepika Padukone played badminton with PV Sindhu

ఇదిలా ఉండగా, దీపికతో ఉన్న ఫోటోలను పీవీ సింధు షేర్ చేశారు. గుడ్ ఫన్, గుడ్ గేమ్ ఆడాం అని పీవీ సింధు ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

ఇదిలా ఉండగా, పీవీ సింధు, దీపిక పదుకోన్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. మేము ఆరాధించే ఇద్దరు అభిమాన తారలు ఒకే పిక్‌లో అంటూ కామెంట్లు పెట్టారు. నా బాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఏమైనా బయోపిక్ ప్లాన్ చేస్తున్నారా? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X