For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2020లో బాలీవుడ్ భామలను పడేసిన తెలుగు హీరోలు: లిస్టులో మిస్ ఇండియా కూడా!

  |

  2020వ సంవత్సరం చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. కరోనా వైరస్ సృష్టించిన అలజడి వల్ల దాదాపు ఎనిమిది నెలల పాటు సినిమాల షూటింగులు నిలిపోవడంతో పాటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో చాలా మంది నిర్మాతలకు నష్టాలు ఎదురవడంతో పాటు ఇండస్ట్రీలను నమ్ముకున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవి ఎలా ఉన్నా.. క్లిష్ట పరిస్థితుల్లోనూ కొందరు తెలుగు హీరోలు బాలీవుడ్ బ్యూటీలను పడేశారు. వాళ్లను ఏకంగా ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేశారు. అసలేంటీ వ్యవహారాలు? పూర్తి వివరాలు మీకోసం!

  దీపిక పదుకొనేను లైన్‌లో పెట్టిన ప్రభాస్

  దీపిక పదుకొనేను లైన్‌లో పెట్టిన ప్రభాస్

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - మహానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ఎంపికైంది. ఈ మూవీతో ఆమె టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.

  మిస్ ఇండియాను తీసుకొచ్చిన డైరెక్టర్

  మిస్ ఇండియాను తీసుకొచ్చిన డైరెక్టర్

  డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారి చేస్తున్న చిత్రం ‘బ్లాక్ రోజ్'. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా మిస్ ఇండియా ఊర్వశీ రౌటేలా తెలుగు చిత్ర సీమలోకి ప్రవేశిస్తోంది. నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో హీరోయిన్ ఊర్వశి రౌతేల న్యూ లుక్‌ని విడుద‌ల చేసింది చిత్రయూనిట్‌. చేతిలో గులాబి పువ్వు ప‌ట్టుకుని ఉన్న ఈ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

  అడివి శేష్ కోసం నమ్రత సెట్ చేసేసింది

  అడివి శేష్ కోసం నమ్రత సెట్ చేసేసింది

  విలక్షణ నటుడు అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్'. ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాన్ని శ‌శికిర‌ణ్ తిక్క రూపొందిస్తున్నాడు. మహేశ్ బాబు సొంత నిర్మాణ సంస్థలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ టాలీవుడ్‌లోకి ఎంటర్ అవబోతుంది.

  విజయ్ దేవరకొండ కోసం ఆమె వచ్చింది

  విజయ్ దేవరకొండ కోసం ఆమె వచ్చింది


  విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘ఫైటర్'. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న దీన్ని పూరీ, ఛార్మీలతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో హిందీ పరిశ్రమకు చెందిన అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. తెలుగులో ఆమె నటిస్తున్న మొట్టమొదటి చిత్రం ఇదే. దీనిపై అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది.

   నాగ శౌర్యను పడేసిన బాలీవుడ్ భామ

  నాగ శౌర్యను పడేసిన బాలీవుడ్ భామ

  విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు లవర్ బాయ్ నాగ శౌర్య. ప్రస్తుతం అతడు అనీశ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా షెర్లీ సేతియా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కొద్ది రోజుల క్రితం మొదలైంది. వీరితో పాటు కొందరు బాలీవుడ్ బ్యూటీలు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్నారు.

  English summary
  The massive success of SS Rajamouli’s Baahubali franchise on the global level has blurred the boundaries between Bollywood and regional cinema like never before. The period actioner catapulted the stardom of Prabhas to a whole new level and since then.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X