చిన్న గదిలో అలా దారుణంగా.. షకీలా దుర్భర జీవితంపై దేవీ నాగవల్లి భావోద్వేగం

ఒకప్పుడు దేవీ నాగవల్లి అంటే అందరూ ఒకలా చూసేవారు.. ట్రోల్స్ చేసేవారు. కానీ దేవీ నాగవల్లిని చూసే కోణాన్ని మార్చేసింది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షోలో నాల్గో సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా ఉంటుందని అంతా భావించారు. నిజానికి ఆమె అంతటి స్ట్రాంగ్ కంటెంస్టెంట్ కూడాను. కానీ కరాటే కళ్యాణి వేసిన బిగ్ బాంబ్ వల్ల మూడో వారంలో నామినేషన్‌లోకి రావడం అనూహ్యంగా ఎలిమినేట్ కావడం జరిగింది.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

దేవీ నాగవల్లి ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. కనీసం ఆ ఊహ ఎవ్వరికీ వచ్చి ఉండదు. కానీ దేవి ఎలిమినేట్ అయిందని ప్రకటించడంతో చూసే ఆడియన్స్, ఇంటి లోపలకి కంటెస్టెంట్లు, స్వయంగా తాను కూడా షాక్ అయిపోయింది. అయితే దేవీ నాగవల్లి ఎలిమినేషన్‌లో ఏదో మతలబు దాగి ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు.

వరుసగా ఇంటర్వ్యూలు..

వరుసగా ఇంటర్వ్యూలు..

ఇక దేవీ నాగవల్లికి ఇంటర్వ్యూలు తీసుకోవడమే తప్పా.. ఇవ్వడం తెలియని దేవీ నాగవల్లి ప్రస్తుతం ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. యూట్యూబ్ ఛానెల్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. వ్యక్తిగత విషయాలు, బిగ్ బాస్ ఇంట్లో జరిగే విషయాలు ఇలా ఎన్నో రకాలుగా స్పందించింది.

అన్వేషణ ప్రోగ్రాం కోసం..

అన్వేషణ ప్రోగ్రాం కోసం..

ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవీ నాగవల్లి మాట్లాడుతూ షకీలా గురించి కామెంట్ చేసింది. ఇంత వరకు మీరు ఇంటర్వ్యూ చేసిన వారిలో ఫేవరేట్ ఎవరైనా ఉన్నారా? అంటూ దేవీ నాగవల్లిని ప్రశ్నించాడు. ఫేవరేట్ అని కాదు కానీ అన్వేషణ ప్రోగ్రాం కోసం షకీలాను ఇంటర్వ్యూ చేసింది మాత్రం బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.

అలాంటి రూంలో..

అలాంటి రూంలో..

ఓ ప్రొడ్యూసర్ దగ్గరి నుంచి ఆమె నంబర్‌ను కనిపెట్టాం. మామూలుగా షకీలా ఎవ్వరి ఫోన్‌లు లిఫ్ట్ చేయదట.. కానీ ఆ రోజు మా ఫోన్ లిఫ్ట్ చేసింది.. ఇలా ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాం అని చెప్పడంతో ఓకే చెప్పింది. వెంటనే చెన్నైకి వెళ్లాం. ఓ అపార్ట్మెంట్ లోపలకి వెళ్లాం. అక్కడ ఆమె ఇళ్లు చూసి షాక్ అయ్యాం. ఓ చిన్న గది.. చిన్న కిచెన్.. అందులో గోడ కూడా ఊడిపోయేందుకు రెడీగా ఉంది అంటూ దేవీ నాగవల్లి షకీలా దుర్భర పరిస్థితి గురించి చెప్పింది.

Recommended Video

Bigg Boss Telugu 4: Devi Nagavalli On Marriage
చూసిన వెంటనే..

చూసిన వెంటనే..

మామూలుగా మనం షకీలా అంటే ఎలా ఉంటుందో అని ఊహిస్తాం కానీ ఆమె అలాంటిది కాదు.. వెళ్లడంతోనే ఎంతో బాగా రిసీవ్ చేసుకుంది. కాఫీ పెట్టి ఇచ్చింది. ఇంటర్వ్యూ అనగానే చిన్నగా లిప్‌స్టిక్ రాసుకుంది. అందుకే ఆమెను ఆ ఇంటర్వ్యూల్లో వేరే కోణాన్ని చూపించాం. ఆ ఇంటర్వ్యూకు మొదటిసారిగా 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో లేదు. సినిమా మ్యూజిక్‌లు వాడటం వల్ల కాపీ రైట్స్ కింద డిలీట్ చేసేశారు అని దేవీ నాగవల్లి చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X