అలా బలి అయ్యాను.. ఎవరైనా ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకొంటానంటే.. దేవీ నోట షాకింగ్ విషయాలు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 వివాదాలు, వినోదంతో జోరుగా సాగుతున్నది. ఇప్పుడు నాలుగో వారంలోకి షో అడుగుపెట్టింది. ఇంట్లో నుంచి మూడో కంటెస్టెంట్ రూపంలో దేవీ నాగవళ్లీ బయటకు వచ్చారు. ఈ షో నుంచి దేవీ నాగవళ్లి ఎలిమినేట్ కావడంపై చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. చాలా మంది ఆమె ఎలిమినేట్ కావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవీ నాగవళ్లీ మీడియాతో మాట్లాడుతూ..
Recommended Video

ఎలిమినేషన్ నాకు బిగ్ షాక్
బిగ్‌బాస్ హౌస్ గురించి వస్తానని అసలు ఊహించలేదు. నేను ఎలిమినేట్ అవుతాననే విషయాన్ని కనీసం ఆలోచించలేదు. ఎలిమినేట్ అయ్యాననే విషయం తెలిసాక మైండ్ బ్లాంక్‌గా మారింది. నాగార్జునతో కలిసి వేదికపైకి వచ్చినప్పుడు ఏం జరుగుతున్నదో అర్ధం కాని పరిస్థితి ఉంది. ప్రేక్షకులు ఇలా చేశారేమిటి? నాకు ఎందుకు ఓట్లు వేయలేదనే విషయంపై నాకు చాలా కన్‌ఫ్యూజన్ ఏర్పడింది అని దేవీ నాగవళ్లీ పేర్కొన్నారు.

Bring back Devi అనే హ్యాష్ ట్యాగ్ చూసిన తర్వాత
అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నాపై వస్తున్న సానుకూలత చూసిన తర్వాత నా వైపు తప్పులేదనిపించింది. Bring back Devi అనే హ్యాష్ ట్యాగ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. నేను పనిచేసే టీవీ ఛానెల్ వల్లనో, మరో కారణం వల్లనో అవుట్ అయ్యాననే విషయాన్ని పట్టించుకోను. కాకపోతే చాలా అంశాల వల్ల నాకు అన్యాయం జరిగింది. ఓట్లు వేయకుండా అలా నన్ను బలి చేశారు అని దేవీ నాగవళ్లీ వెల్లడించారు.

గంగవ్వ, అభిజిత్, అఖిల్ స్ట్రాంగ్
గంగవ్వ, నోయల్ సీన్, అభిజిత్, అఖిల్, లాస్య టాప్ 5లో ఉంటారనేది నా అభిప్రాయం. ఇంటి నుంచి బయటకు రావడానికి అవకాశం ఉన్న వారిలో మెహబూబ్, అరియానా, సోహైల్, కుమార్ సాయి ఉంటారు అని దేవీ నాగవళ్లి అన్నారు. కొన్నాళ్లపాటు గంగవ్వ మంచిగా ఉంటే ఆమెకు ఛాన్స్ ఉంటుంది. గంగవ్వకు నిర్వాహకుల నుంచి సపోర్ట్ ఉంది. ఆమె వయసు కారణంగా ఆమె కొంత సానుకూలత ఉంది అని దేవీ నాగవళ్లి అన్నారు.

దాంపత్య జీవితం ఫెయిల్ కాలేదు..
వ్యక్తిగతం నేను స్ట్రాంగ్ అయినప్పటికి దాంపత్య జీవితంలో ఫెయిల్ కావడం వెనుక మరే కారణం లేదు. ఉద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉండలేకపోయాను. నా ప్రొఫెషన్‌ను కొనసాగించాలని అనుకొన్నాను. ఇంట్లో నా నిర్ణయాన్ని చెబితే కొన్నాళ్లు చర్చలు జరిగాయి. ఎలాంటి గొడవలు, విభేదాలు లేకుండా విడిపోయాం. ఇద్దరు మంచి వాళ్లు కలిసి ఉంటారని చెప్పలేం దేవీ నాగవళ్లీ తెలిపారు.

ఎవరైనా ప్రపోజ్ చేస్తే..
మ్యారేజ్ బ్రేకప్ జరగడం వల్ల బాధలేదు. నా జీవితంలో జరిగాల్సింది జరిగిపోయింది. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. బిగ్‌బాస్‌లో నేనంటే ఏమిటో తెలిసిన తర్వాత నాకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆలోచిస్తాను. పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనలేదు. పెళ్లి చేసుకోవడం తప్పు అని భావించడం లేదు. నా కొడుకు కార్తీకేయ గురించి నా ఆలోచనలు ఉన్నాయి. కార్తీకేయ ఎలా అర్ధం చేసుకొంటాడు అనే విషయంపై నా ఆలోచన అంతా అని దేవీ నాగవళ్లీ అన్నారు.


Click it and Unblock the Notifications











