twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    10నెలలు హాస్పిటల్‌లోనే ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. అందుకే ఇండస్ట్రీ వాళ్ళను రానివ్వలేదు: కుటుంబ సభ్యులు

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బెస్ట్ కమెడియన్స్ లలో ఒకరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో టైమింగ్ తో నవ్వించగలిగే టాలెంట్ ఉన్న ఆయన 2013లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోలేదనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక చాలా కాలం తరువాత ఒక ఇంటర్వ్యూలో కుటుంబ సభ్యులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

    అత్యధిక పారితోషికం పొందిన టాప్ కమెడియన్

    అత్యధిక పారితోషికం పొందిన టాప్ కమెడియన్

    తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందిన అగ్రశ్రేణి హాస్యనటులలో ఒకరిగా గుర్తింపు పొందిన సుబ్రహ్మణ్యం డైలాగ్ మాడ్యులేషన్ తోనే అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నారు. కొన్ని టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక వై.ఎస్. రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు, సుబ్రహ్మణ్యం భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు కూడా.

    దర్శకుడిగా కూడా..

    దర్శకుడిగా కూడా..

    ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘం ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. అలస్యం అమృతం (2010), యజ్ఞం (2004) చిత్రాలలో ఆయన నటనకు ఉత్తమ పురుష హాస్యనటుడి విభాగంలో రెండు రాష్ట్ర నంది అవార్డులు కూడా దక్కాయి. ఇక ఆయన కేవలం ఒక కమెడియన్ గానే కాకుండా పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి అనంతరం తోకలేని పిట్ట, ఆనందో బ్రహ్మ అనే సినిమాలను కూడా డైరెక్ట్ చేశాడు.

    బిజీ కమెడియన్ గా..

    బిజీ కమెడియన్ గా..

    1989లో నటుడిగా మొదలైన సుబ్రహ్మణ్యం ప్రయాణం 2013 వరకు ఎంతో బిజి కమెడియన్ గా కొనసాగారు. నువ్వే కావాలి, నువ్వు నేను వంటి సినిమాల అనంతరం ఆయన ఏడాదికి 10కి పైగా సినిమాలు చేస్తూ అత్యదిక పారితోషికం అందుకున్న నటులలో ఒకరిగా నిలిచారు. 2013లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించే కొన్ని నెలల ముందు వరకు పదుల సంఖ్యలు సినిమాలో బిజీగా ఉండేవారు.

    10నెలల వరకు హాస్పిటల్ లోనే..

    10నెలల వరకు హాస్పిటల్ లోనే..

    ఇక ఆయన మరణం వెనుక అనేక రకాల కారణాలు వైరల్ అవుతుండగా కుటుంబ సభ్యులు ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. ధర్మవరపు సతీమణి, అలాగే చిన్న కుమారుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చివరి రోజుల గురించి మాట్లాడుతూ.. దాదాపు 10నెలల వరకు అనారోగ్యంతో హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చిందని తెలియజేశారు.

    అందుకే ఇండస్ట్రీ వాళ్ళను రానివ్వలేదు

    అందుకే ఇండస్ట్రీ వాళ్ళను రానివ్వలేదు

    ధర్మవరపు సుబ్రహ్మణ్యం 10నెలల వరకు హాస్పిటల్ లో ఉంటే చూడటానికి ఎవరు రాలేదు అనే వార్తలను కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. చాలా మంది వస్తామని అన్నప్పటి ఆయనే రానివ్వలేదని, తన పరిస్థితి చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటే తట్టుకోలేనని చెప్పారని అన్నారు. ఇండస్ట్రీలో చాలా మందితో ఎమోషనల్ బాండింగ్ ఉండేదని అంటూ వారు పనులన్నీ పక్కనపట్టి బాధపడడం ఎందుకనే ఉద్దేశ్యంతోనే రానిచ్చేవారు కాదని కుటుంబ సభ్యులు తెలిపారు.

    ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదంటే..

    ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదంటే..

    ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని అన్నారు. కానీ ఎవరిని చేయి చాచి అడగకుండా ఒక ప్లానింగ్ తో ఉన్నామని అన్నారు. నాన్నగారు ఆ విధంగా సెటిల్ చేసారని చెప్పిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు హాస్పిటల్ లో ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పాడు.

    Recommended Video

    Dubsmash Teaser || Getup Srinu || Pavan Krishna || Supraja ||
    పొలిటికల్ గా వైఎస్ చాలా క్లోజ్

    పొలిటికల్ గా వైఎస్ చాలా క్లోజ్

    పొలిటికల్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు అనుబంధం ఉండేదని అందరికి తెలిసిన విషయమే అయితే వారు ఎంత సన్నిహితంగా ఉండేవారు అంటే వైఎస్సార్ క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నా కూడా డైరెక్ట్ వెళ్లి కలిసే అత్యంత ముఖ్యమైన ఆప్తుల్లో నాన్నగారు ఒకరని ధర్మవరపు సుబ్రహ్మణ్యం చిన్నకుమారుడు వివరణ ఇచ్చారు. ఇప్పటికి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉంటారని, అంబటి రాంబాబు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలియజేశారు.

    English summary
    Dharmavarapu Subramanyam is one of the best comedians of all time in the Telugu film industry. It is known that he died in 2013 as he has the talent to laugh with timing in his own style in any role. It is safe to say that his death was largely unknown to the outside world. There have also been comments about who in the industry cares. Not long after, in an interview, the family members revealed some interesting things.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X