Bhagavanth Kesari -Leo: భగవంత్ కేసరి వర్సెస్ లియో... ఈ కామన్ పాయింట్స్ గమనించారా?

దసరా కంటే ముందే మూవీ లవర్స్ కు సినిమా పండుగ వచ్చిందోచ్. ఇక ఈ పండక్కి మూడు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అవి కూడా పెద్ద సినిమాలు... ఇంకేముంది మూవీ లవర్స్ అంతా థియేటర్ల బాట పట్టారు. అయితే ఈ పండక్కి రిలీజ్ అయిన సినిమాల్లో లియో, భగవంత్ కేసరి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో కొన్ని పేరుతో పాటు.. కామన్ పాయింట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కామన్ పాయింట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అసలు ఆ కామన్ పాయింట్స్ ఏంటి.. లియోకి భగవంత్ కేసరి సినిమాకు సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం.

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందకు వచ్చి సందడి చేస్తోంది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. కలెక్షన్ల పరంగా సైతం దూసుకుపోతుంది. ఇక ఈ మూవీకి పోటీగా మరో తమిళ సినిమా లియో పాన్ ఇండియా లెవెల్ వచ్చింది. ఇక ఈ సినిమాలో దలపతి విజయ్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

 Did you notice the common points in the movies Balayya Bhagavanth Kesari and Vijay Leo?

ఇక భగవంత్ కేసరి సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల.. బాలయ్య కూతురిగా ఈ సినిమాలో నటించింది. ఇక చందమామ హీరోయిన్ కాజల్ మరో కీలక పాత్రలో నటించింది. విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించాడు. ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మించారు.

ఇక లియో సినిమా విషయానికి వస్తే దలపతి విజయ్ హీరోగా... అందాల భామ త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్జున్ సర్జాతో పాటు.. సంజయ్ దత్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, గౌతం మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమాకు మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

 Did you notice the common points in the movies Balayya Bhagavanth Kesari and Vijay Leo?

ఇప్పుడు లియో, భగవంత్ కేసరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు పోటా పోటిగా వసూళ్లు రాబడుతున్నాయి. అయితే లియో పాన్ ఇండియా చిత్రం.. తెలుగు వరకు చూసుకుంటే.. బాలయ్యతో విజయ్ ఢీకొట్టే విధంగా వసూళ్లు రాబడుతున్నాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే... ఈ రెండు సినిమాల మధ్య కామన్ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఏముంది పేర్లే కదా అనుకుంటే పొరపాటే... పేర్లతో పాటు సినిమా కథలోనూ కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి.

భగవంత్ కేసరి సినిమాలో కేసరి అంటే సింహం... లియో అంటే సింహం.. ఇది ఓ కామన్ పాయింట్ కాగా.. మరికొన్ని కామన్ పాయింట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. బాలకృష్ణ సినిమాలో విలన్ గా అర్జున్ రాంపాల్ నటించాడు. ఇక ఈ మూవీలో ఆయన తన బిజినెస్ కాపాడుకునేందుకు కన్న కొడుకును కూడా చంపేస్తాడు. ఇక ఇదే సీన్ లియో చిత్రంలో కూడా కనిపిస్తుంది.. కాకపోతే... లియో సినిమాలో కొడుకు తప్పించుకుని బయటపడుతాడు.

 Did you notice the common points in the movies Balayya Bhagavanth Kesari and Vijay Leo?

మరో కామన్ పాయింట్ ఏమిటంటే... రెండు సినిమాల్లో కథానాయకులు తమ కుటుంబం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతారు. ఇక మరో పాయింట్.. హీరోలిద్దరూ తమ వయసుకు తగ్గ పాత్రలు చేశారు. ఇక ఈ రెండు సినిమాల్లో సంగీత దర్శకులు వేరైనా.. బీజీఎం మాత్రం బాక్సులు బద్దలు అయ్యేలా కంపోజ్ చేశారు. ఇలా ఈ రెండు సినిమాలకు కామన్ పాయింట్స్ ఉన్నట్లు మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X