Hanshitha Reddy: వెకేషన్‌లో దిల్ రాజు కూతురు.. టాప్ యాంగిల్‌లో అందాలు చూపిస్తూ!

తెలుగు అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. వరుసగా సినిమాలు నిర్మిస్తూ సత్తా చాటుతుంటారు. తమిళ అగ్ర హీరో ఇళయదళపతి విజయ్ హీరోతో వారసుడు సినిమాను బైలింగువల్ మూవీగా విడుదల చేశారు. దీంతో కోలీవుడ్ లో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఇక తెలుగులో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా హవా చూపిస్తున్న ఆయనకు కూతురు హన్షిత రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.

తెలుగుకే కాకుండా: దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయ్యారు. ఒకప్పుడు తెలుగులో విజయవంతమైన డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా పేరు సంపాదించిన దిల్ రాజు కాల క్రమేణా భారీ చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల కాలంలో కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తూ సత్తా చాటుతున్నారు.

Dil Raju Daughter Hanshitha Reddy Vacation With Husband Photos Goes Viral

సాలిడ్ హిట్.. డిజాస్టర్ టాక్: ఇతర భాషలో కూడా చిత్రాలు నిర్మిస్తున్న దిల్ రాజు వారిసు సినిమాతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తో వాల్తేరు వీరయ్య దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లి డైరెక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. అలాగే తెలుగులో ఇటీవల బలగం సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి.. శాకుంతలం మూవీతో డిజాస్టర్ అందుకున్నారు.

Dil Raju Daughter Hanshitha Reddy Vacation With Husband Photos Goes Viral

జూన్ 29న: ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న దిల్ రాజు 2020లో రెండో పేళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో నిజామాబాద్ లోని ఓ గుడిలో తేజస్విని (వైగా రెడ్డి) రెండో వివాహం చేసుకున్నారు దిల్ రాజు. ఈ దంపతులిద్దరికి 2022 జూన్ 29న మగ బిడ్డ జన్మించాడు.

Dil Raju Daughter Hanshitha Reddy Vacation With Husband Photos Goes Viral

నిర్మాతగా మారి: దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించారు. ఈ జంటకు కూతురు అన్షిత రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్షిత రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే బలగం సినిమాతో దిల్ రాజు కూతురు నిర్మాతగా మంచి హిట్ అందుకున్నారు.

Dil Raju Daughter Hanshitha Reddy Vacation With Husband Photos Goes Viral

ఎంజాయ్ చేస్తూ: బలగం సినిమా కంటే ముందుగా హన్షిత రెడ్డి ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు. జీ5 వేదికగా విడుదలైన ఈ సిరీస్ కూడా పర్వాలేదనిపించుకుంది. ఇలా సినిమాలు, వెబ్ సిరీసులతో నిర్మాతగా సత్తా చాటుతున్న హన్షిత 2014లో మే 4వ తేదీన అర్చిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. తరచుగా ఈ జంట వెకేషన్ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో యాక్టివ్ గా ఉంటారు.

సముద్రపు అందాలను: తాజాగా పెళ్లి రోజు సందర్భంగా విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది హన్షిత-అర్చిత్ జంట. ఈ నేపథ్యంలో భర్తతో కలిసి దిగిన ఫొటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది హన్షిత. ఇందులో టాప్ యాంగిల్ లో కెమెరాకు పోజులిస్తూ సముద్రపు అందాలను చూపించారు. దీంతో ఈ పిక్స్ వైరల్ కాగా చూడముచ్చటగా ఉన్న హన్షిత జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X