వైరల్ పిక్ : ఆ పనిలో పడ్డ దిల్ రాజు.. భార్యతో కలిసి నిర్మాత ఆటలు

దిల్ రాజు పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు.. సక్సెస్‌కు చిరునామ.. దిల్ రాజు. ఆయన ఓ సినిమాను నిర్మిస్తున్నాడంటే సగటు సినీ ప్రేమికుడిలో ఓ నమ్మకం ఉంటుంది. అంతటి బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దిల్ రాజు ఈ లాక్ డౌన్ కాలంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య అనిత చనిపోయాక ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. ఈ మధ్య వైఘా రెడ్డి (తేజస్వీని)ని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయ్యాక దిల్ రాజు తన లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చినట్టు తెలుస్తోంది. నూతనోత్సాంతో దిల్ రాజు ఫుల్ జోష్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది.

లాక్‌డౌన్‌లో పెళ్లి..

లాక్‌డౌన్‌లో పెళ్లి..

దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతోన్నాడనే వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. కొందరైతే ఏకంగా పెళ్లి కూడా అయిపోయిందనే రాసేశారు. దీంతో దిల్ రాజు బాగా హర్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని, దొంగ చాటుగా చేసుకోనని, కానీ అలాంటి వార్తలు రాయమేండని దిల్ రాజు సన్నిహితుల దగ్గర వాపోయారట. లాక్ డౌన్‌లోనే అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య తనకు కలిసి వచ్చిన నిజామాబాద్ గుడిలో వైఘా రెడ్డిని వివాహం చేసుకున్నాడు.

తొలి సెల్ఫీ రచ్చ..

తొలి సెల్ఫీ రచ్చ..

దిల్ రాజు భార్య వైఘా రెడ్డి ఎయిర్ హెస్టెస్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి అనంతరం సోషల్ మీడియాలో ఓ పిక్ తెగ వైరల్ అయింది. పెళ్లి తరువాత మొదటి సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఓ రేంజ్‌లో హల్చల్ చేసింది. ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి మార్కులు పడ్డాయి.

తిరుమలకు పయణం..

తిరుమలకు పయణం..

వివాహం అనంతరం దంపతులిద్దరూ తిరుమలకు చేరుకున్నారు. వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడానికి తిరుమలకు వెళ్లారు. అక్కడి మీడియాతో దిల్ రాజు తన భార్యతో కలిసి ముచ్చటించాడు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. తాజాగా మరో ఫోటో చక్కర్లు కొడుతోంది.

Recommended Video

Sushant Singh Rajput Fans Demand #DilBecharaOnBigScreen, AR Rahman Supports
ఆ పనిలో పడ్డ దిల్ రాజు..

ఆ పనిలో పడ్డ దిల్ రాజు..

పెళ్లి తరువాత దిల్ రాజు తన ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తన బాడీకి బాగా పని చెబుతున్నాడట. జిమ్‌లో వర్కౌట్లు, భార్యతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడట. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. భార్యతో కలిసి దిల్ రాజు ఆటలు ఆడుతున్న ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. మొత్తానికి దిల్ రాజు నవ యవ్వనుడిగా మారబోతోన్నాడు. ఈ లాక్ డౌన్ సమయాన్ని దిల్ రాజు ఇలా ఫుల్లుగా వాడుకుంటున్నాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X