దిల్ రాజు ఇంట్లో మళ్లీ పండగ కళ.. సీక్రెట్‌గా.. ముద్దు ముద్దుగా వేడుక

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరగడంతో కుటుంబ సభ్యులంతా సంతోష క్షణాలను చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. సతీవియోగం తర్వాత దిల్ రాజు తోడు కావాల్సిందేనని కూతురు హన్షితా రెడ్డితో సహా మిత్రులు, సన్నిహితులు కోరుకోవడంతో ఇంట్లో పెళ్లి కళ పండగ వాతావరణం ఏర్పడింది. పెళ్లి తర్వాత దిల్ రాజు ఇంట్లో తాజాగా మనవరాలు అన్నప్రసాన కార్యక్రమం జరగడంతో మళ్లీ ఆనంద క్షణాలు చోటుచేసుకొన్నాయి. వివరాల్లోకి వెళితే..

దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి డాటర్

దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి డాటర్

దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి వివాహం అచ్యుత్ రెడ్డితో జరిగిన విషయం తెలిసిందే. వారిద్దరికి ఇద్దరు సంతానం కూడా. తన మనవడు అరన్ష్ బాల నటుడిగా పరిచయమయ్యారు. అరన్ష్ ఇటీవల అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను చిత్రంలో చిన్నప్పటి అఖిల్‌గా నటించి ఆకట్టుకొన్నారు. ఇక తమ రెండో కుమార్తే ఇషికా ఆర్నేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున జన్మించారు. తాజాగా ఇషిక పుట్టి ఆర్నెళ్లు పూర్తి కావడంతో దిల్ రాజు తన మనవరాలికి అన్నప్రసాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రముఖ దేవాలయంలో అన్నప్రాసన కార్యక్రమం

ప్రముఖ దేవాలయంలో అన్నప్రాసన కార్యక్రమం

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ దేవాలయంలో కుటుంబ కార్యక్రమంగా ఇషిక అన్నప్రసాదన కార్యక్రమం జరిగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దిల్ రాజు కుటుంబ సభ్యులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకొని ఈ వేడుకను పండుగలా నిర్వహించినట్టు తెలిపారు. ఈ వేడుక ఆద్యంతం ఆనందోత్సవాల మధ్య జరిగిందని సన్నిహితులు తెలిపారు.

సంప్రదాయ పద్దతుల్లో

సంప్రదాయ పద్దతుల్లో

నిర్మాత దిల్ రాజు తన మనవరాలి అన్నప్రాసన కార్యక్రమాన్ని సంప్రదాయ పద్దతులకు అనుగుణంగా నిర్వహించారు. బంగారం, డబ్బు, పుస్తకం లాంటి వస్తువులను తన మనవరాలి ముందు ఉంచారు. చిన్నారి వాటిని చూస్తూ సంతోషంలో మునిగిపోయారు. ఈ వేడుక చాలా ఆసక్తికరంగా సాగింది. అయితే చిన్నారి ఏ వస్తువును ముట్టుకొన్నారనే విషయాన్ని కుటుంబ సభ్యులు సీక్రెట్‌గా ఉంచడం గమనార్హం.

కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో

కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో

తన కూతురు ఇషికా అన్నప్రసాన వేడుక కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను దిల్ రాజు కూతురు, కుటుంబ సభ్యుల ఫోటోలను హన్షితా రెడ్డి తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిన్నారి ఫోటోలపై నెటిజన్లు ముద్దు ముద్దుగా కామెంట్స్ చేస్తూ విషెస్ అందజేస్తున్నారు.

Recommended Video

Sushant Singh Rajput Fans Demand #DilBecharaOnBigScreen, AR Rahman Supports
సతీమణితో కలిసి తిరుమలకు

సతీమణితో కలిసి తిరుమలకు

ఇక దిల్ రాజు విషయానికి వస్తే.. ఈ స్టార్ ప్రొడ్యూసర్‌ తిరుపతి వెంకటేశ్వరస్వామికి పరమభక్తుడు. ప్రతీ సినిమా రిలీజ్‌కు ముందు బాలాజీని దర్శించుకోవడం తప్పనిసరి. తాజా తన పెళ్లి సమయంలో లాక్‌డౌన్ కొనసాగిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత తన సతీమణితో కలిసి ఇటీవల శ్రీవారిని దర్శించుకోవడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X