పవన్ కల్యాణ్‌తో మరొకటి: గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు.. ఈ సారి భారీగా అంటూ టైటిల్ రివీల్ చేసేశాడు

డిస్టిబ్యూటర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత నిర్మాతగా మారి.. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్‌గా వెలుగొందుతున్నాడు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన.. తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలను అందుకున్నారు. ఇక, పవన్ కల్యాణ్‌తో రీఎంట్రీకి ఒప్పించి.. 'వకీల్ సాబ్' అనే సినిమాను నిర్మించిన దిల్ రాజు.. భారీ హిట్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు మీకోసం!

పవన్ విషయంలో దిల్ రాజు సక్సెస్

పవన్ విషయంలో దిల్ రాజు సక్సెస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరమయ్యాడు పవన్ కల్యాణ్. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో ఆయనను ఎంతో మంది దర్శక నిర్మాతలు సంప్రదించారు. కానీ, వాళ్లకు నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంట్రీ ఇచ్చి పవన్‌తో రీఎంట్రీ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు.

‘వకీల్ సాబ్‌'గా వచ్చిన పవన్ స్టార్

‘వకీల్ సాబ్‌'గా వచ్చిన పవన్ స్టార్

సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి వస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇందుకోసం 'వకీల్ సాబ్' మూవీని ఎంచుకున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

భార్యతో కలిసి సినిమా.. ఫ్యాన్‌లాగే

భార్యతో కలిసి సినిమా.. ఫ్యాన్‌లాగే

'వకీల్ సాబ్' నిర్మాతే అయినా.. పవన్ కల్యాణ్ అభిమానిగా తెగ హడావిడి చేస్తున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ట్రైలర్ లాంఛ్‌ సమయంలో థియేటర్‌లో ఉద్వేగంతో ఊగిపోయి మాట్లాడిన ఆయన.. రిలీజ్ రోజే తన భార్య తేజస్వినితో కలిసి సినిమా చూశారు. అంతేకాదు, నిర్మాత అన్న విషయాన్ని మరిచి పేపర్లు విసురుతూ.. ఈలలు వేస్తూ.. కేకలు పెడుతూ థియేటర్‌లో రచ్చ రచ్చ చేశారు.

అదిరిన టాక్... ఒక్క రోజే 40 కోట్లు

అదిరిన టాక్... ఒక్క రోజే 40 కోట్లు

'వకీల్ సాబ్' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు. టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లనూ సాధించిందీ చిత్రం. ఫస్ట్ డే ఏకంగా రూ. 40 కోట్లు వరకూ వసూలు చేసిన ఈ మూవీ.. ఒక్కరోజులోనే దాదాపు 40 శాతం రికవరీ చేసింది. అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది.

సక్సెస్ మీట్.. వాళ్లతో కలిసి అక్కడ

సక్సెస్ మీట్.. వాళ్లతో కలిసి అక్కడ

'వకీల్ సాబ్' మూవీ ఘన విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా హీరోయిన్లు అంజలి, అనన్య, దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి దిల్ రాజు సుదర్శన్ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరిచేలా ప్రసంగించారు. 'ఈ సినిమా కలెక్షన్లు కానీ.. టాక్ కానీ అదిరిపోయింది. ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్' అని చెప్పారు.

పవన్.. మీకు ఓ విషయం చెప్పారు

పవన్.. మీకు ఓ విషయం చెప్పారు

సుదర్శన్ థియేటర్‌లో మాట్లాడుతూ.. 'నా డ్రీమ్ హీరోతో సినిమా అనుకున్నప్పుడు నాకు కావాల్సిన రైట్ సినిమా తీసి ఇచ్చాడు వేణు. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. పవర్ స్టార్ సినిమా గురించి తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకి వచ్చేటప్పుడు అందరూ మాస్క్‌లు పెట్టుకుని రండి. ఇది కళ్యాణ్ గారు మీకు చెప్పమన్నారు' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు.

Recommended Video

Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన దిల్

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన దిల్

ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. 'త్వరలోనే 'వకీల్ సాబ్ మీట్' అనే ఈవెంట్‌ను చేయబోతున్నాం. దీనికి పవన్ కల్యాణ్ గారు కూడా వస్తున్నారు. మళ్లీ అక్కడ కలుసుకుందాం' అంటూ వాళ్లలో మరింత జోష్‌ను నింపారు. గతంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేయగా.. దానికి పర్మీషన్ రాలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X