twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూర్తిగా మారిన దిల్ రాజు.. భార్యతో రొమాంటిక్‌గా.. హీరో లుక్‌లో నిర్మాత

    |

    వయసు అనేది కేవలం నంబర్. అది సత్యం కూడా. ఎందకంటే వయసు అనేది మనసుకు సంబంధించినది కానే కాదు. మన ఆలోచనలు, మన మనసులోని భావనలే ఆ తేడాను చూపిస్తాయి. అందుకు యాభై యేళ్లు ఉన్న దిల్ రాజు సైతం రెండో పెళ్లి అనంతరం కుర్రాడిలా మారిపోయాడు. అందుకు తగ్గట్టే లాక్ డౌన్ కారణంగా దొరికిన ఈ సమయాన్ని భార్యకే కేటాయించాడు. ప్రస్తుతం వీరిద్దరూ దాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

    లాక్‌డౌన్‌లో పెళ్లి..

    లాక్‌డౌన్‌లో పెళ్లి..

    లాక్ డౌన్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య తనకు కలిసి వచ్చిన నిజామాబాద్ గుడిలో వైఘా రెడ్డి(తేజస్వీని)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం దిల్ రాజు పూర్తిగా మారిపోయాడు. ఈడుజోడు బాగుందని అనిపించుకునేందుకు దిల్ రాజు కసరత్తులు కూడా చేస్తున్నాడు.

    భార్యతో కలిసి..

    భార్యతో కలిసి..

    దిల్ రాజు తన భార్య వైఘా రెడ్డితో దిగిన మొదటి సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఓ రేంజ్‌లో హల్చల్ చేసింది. దిల్ రాజు జంటకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ కారణంగా దొరికిన ఈ సమయం నవ దంపతులకు వరంగా మారింది.

    జాలీ టైమ్..

    జాలీ టైమ్..

    వివాహం అనంతరం దంపతులిద్దరూ తిరుమలను దర్శించకున్నారు. లాక్ డౌన్ కారణంగా మరీ విదేశాలకు వెళ్లే అవకాశం అయితే లేదు గానీ ఇంట్లోనే వీరు ఎంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా దిల్ రాజు తన ఫిట్‌నెస్ బాగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

    భార్యతో ఆటలు..

    భార్యతో ఆటలు..

    పెళ్లి తరువాత సహజంగా మార్పులు వస్తాయి. అందులోనూ దిల్ రాజు విషయంలో చాలా వస్తున్నాయి. జిమ్‌లో వర్కౌట్లు, భార్యతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతూ లాక్ డౌన్‌ను బాగా వినియోగించుకుంటున్నాడు. అయితే ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి ఎంత ఆలోచించినా, ఫ్యామిలీకి కూడా సమయాన్ని వెచ్చిస్తున్నాడు.

    ఫుల్ రిలాక్స్..

    ఫుల్ రిలాక్స్..

    ప్రస్తుతం దిల్ రాజు ఫుల్ రిలాక్స్‌గానే ఉన్నాడట. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చక్కబడే వరకు దిల్ రాజు తన కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని చూస్తున్నాడట. అందుకే భార్యతో కలిసి ఎక్కువగా గడుపుతున్నాడు. వీరి అన్యోన్యతను తెలిపేలా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

    Recommended Video

    Sushant Singh Rajput Fans Demand #DilBecharaOnBigScreen, AR Rahman Supports
     బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా..

    బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా..

    ఎంత ఇంట్లోనే ఉంటున్నా దిల్ రాజు మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్‌లు, బాలీవుడ్ ఎంట్రీపై బాగానే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జెర్సీ రీమేక్‌తో బాలీవుడ్‌లో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చేందకు సిద్దం కాగా.. తాజాగా హిట్ రీమేక్‌ను కూడా నిర్మించేందుకు సిద్దమయ్యాడు. రాజ్ కుమార్ రావు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో దిల్ రాజు బాలీవుడ్‌లో హిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

    English summary
    Dil Raju Romantic pic With His Wife. He seems to be smitten by his new wife. The recent family photoshoot with Vygha Reddy shows that he found the ‘lover boy’ in him again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X