Don't Miss!
- Sports DC vs SRH: సిక్సర్ల సునామీ.. హెల్మెట్లతో బాల్ బాయ్స్!వైరల్
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పూర్తిగా మారిన దిల్ రాజు.. భార్యతో రొమాంటిక్‌గా.. హీరో లుక్‌లో నిర్మాత
వయసు అనేది కేవలం నంబర్. అది సత్యం కూడా. ఎందకంటే వయసు అనేది మనసుకు సంబంధించినది కానే కాదు. మన ఆలోచనలు, మన మనసులోని భావనలే ఆ తేడాను చూపిస్తాయి. అందుకు యాభై యేళ్లు ఉన్న దిల్ రాజు సైతం రెండో పెళ్లి అనంతరం కుర్రాడిలా మారిపోయాడు. అందుకు తగ్గట్టే లాక్ డౌన్ కారణంగా దొరికిన ఈ సమయాన్ని భార్యకే కేటాయించాడు. ప్రస్తుతం వీరిద్దరూ దాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
లాక్డౌన్లో పెళ్లి..
లాక్ డౌన్లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య తనకు కలిసి వచ్చిన నిజామాబాద్ గుడిలో వైఘా రెడ్డి(తేజస్వీని)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం దిల్ రాజు పూర్తిగా మారిపోయాడు. ఈడుజోడు బాగుందని అనిపించుకునేందుకు దిల్ రాజు కసరత్తులు కూడా చేస్తున్నాడు.
భార్యతో కలిసి..
దిల్ రాజు తన భార్య వైఘా రెడ్డితో దిగిన మొదటి సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ఓ రేంజ్లో హల్చల్ చేసింది. దిల్ రాజు జంటకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అవుతోంది. లాక్ డౌన్ కారణంగా దొరికిన ఈ సమయం నవ దంపతులకు వరంగా మారింది.
జాలీ టైమ్..
వివాహం అనంతరం దంపతులిద్దరూ తిరుమలను దర్శించకున్నారు. లాక్ డౌన్ కారణంగా మరీ విదేశాలకు వెళ్లే అవకాశం అయితే లేదు గానీ ఇంట్లోనే వీరు ఎంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా దిల్ రాజు తన ఫిట్నెస్ బాగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.
భార్యతో ఆటలు..
పెళ్లి తరువాత సహజంగా మార్పులు వస్తాయి. అందులోనూ దిల్ రాజు విషయంలో చాలా వస్తున్నాయి. జిమ్‌లో వర్కౌట్లు, భార్యతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతూ లాక్ డౌన్‌ను బాగా వినియోగించుకుంటున్నాడు. అయితే ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి ఎంత ఆలోచించినా, ఫ్యామిలీకి కూడా సమయాన్ని వెచ్చిస్తున్నాడు.
ఫుల్ రిలాక్స్..
ప్రస్తుతం దిల్ రాజు ఫుల్ రిలాక్స్‌గానే ఉన్నాడట. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చక్కబడే వరకు దిల్ రాజు తన కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని చూస్తున్నాడట. అందుకే భార్యతో కలిసి ఎక్కువగా గడుపుతున్నాడు. వీరి అన్యోన్యతను తెలిపేలా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Recommended Video
బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా..
ఎంత ఇంట్లోనే ఉంటున్నా దిల్ రాజు మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్‌లు, బాలీవుడ్ ఎంట్రీపై బాగానే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జెర్సీ రీమేక్‌తో బాలీవుడ్లో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చేందకు సిద్దం కాగా.. తాజాగా హిట్ రీమేక్‌ను కూడా నిర్మించేందుకు సిద్దమయ్యాడు. రాజ్ కుమార్ రావు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో దిల్ రాజు బాలీవుడ్లో హిట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.