భార్య కోసం భారీ ప్లాన్ చేసిన దిల్ రాజు: ఆ ఫంక్షన్‌లోనే పరిచయం.. ప్రకటించేది కూడా ఆరోజే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్‌గా వెలుగొందుతున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. చాలా సినిమాలను పంపిణీ చేశాడు. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా నటించిన 'దిల్' అనే సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారాడు. ఈ సినిమాతో పాటు దాని తర్వాత చేసిన పలు ప్రాజెక్టులు సూపర్ డూపర్ హిట్ అవడంతో స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయాడాయన. అప్పటి నుంచి ఎన్నో మంచి సినిమాలను నిర్మించి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్‌గా పేరొందాడు. ఇటీవలే వివాహం చేసుకున్న దిల్ రాజు.. తన భార్య కోసం భారీ ప్లాన్ వేశాడట. ఆ వివరాలు మీకోసం!

రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు

రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు

దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి విధితమే. ఆమె పోయిన తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్న ఆయన.. 2020 మే 10న హైదరాబాద్‌కు చెందిన తేజస్వినీని వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా నిరాడంభరంగా జరిగిన ఈ వేడుకను నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిపారు.

భార్యతో కలిసి టూర్లు.. ఫొటోలు వైరల్

భార్యతో కలిసి టూర్లు.. ఫొటోలు వైరల్

వివాహం తర్వాత దిల్ రాజు తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే భార్యతో కలిసి కొన్ని పుణ్య క్షేత్రాలు కూడా సందర్శించిన ఆయన.. పలు ప్రాంతాలకు టూర్ వెళ్లారు. అదే సమయంలో తేజస్వినీతో కలిసి తరచూ ఫొటోలు దిగుతున్నారు. అంతేకాదు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఇటీవల ఆయన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు

ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు

తన భార్య తేజస్వినీని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట ఈ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం తెరకెక్కించనున్న సినిమాకు ఆమె రచయితగా మారి కథను రెడీ చేసినట్లు ఆ మధ్య ఓ వార్త బయటకు వచ్చింది. ఆ కథకు మెరుగులు పెట్టేందుకు దిల్ రాజు ఓ టీమ్‌ను కూడా రెడీ చేశారని అన్నారు. దీన్ని ఆయనే నిర్మిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

భార్య కోసం స్పెషల్ పార్టీ ప్లాన్ చేశాడు

భార్య కోసం స్పెషల్ పార్టీ ప్లాన్ చేశాడు

డిసెంబర్ 18న దిల్ రాజు యాభైవ పుట్టినరోజును జరుపుకోనున్నారు. దీని కోసం ఆయన భారీ పార్టీ ప్లాన్ చేశారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో జరగనున్న ఈ ఫంక్షన్‌లో తన భార్య తేజస్వినిని సినీ పెద్దలకు పరిచయం చేయబోతున్నాడట. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేసేశారని తెలుస్తోంది.

సినిమా ప్రకటన కూడా ఫంక్షన్‌లోనేనా

సినిమా ప్రకటన కూడా ఫంక్షన్‌లోనేనా

తేజస్వినీ రచయితగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్‌లోనే దానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘F3' సినిమా గురువారమే అధికారికంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X