భార్యకు దిల్ రాజు ఇచ్చిన స్పెషల్ గిఫ్టు ఏమిటంటే! ఘనంగా మొదటి వివాహ వార్షికోత్సవం!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొఫెషనల్‌గా వరుస విజయాలతోపాటు, వ్యక్తిగతంగా మంచి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌లో వైఘా రెడ్డితో దిల్ రాజు వివాహం జరిగిన విషయం తెలిసిందే. భార్యతో కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే సినిమాల నిర్మాణంపై జోష్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు తన వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు విదేశాలకు వెళ్లడం గమనార్హం. అయితే దిల్ రాజు తన భార్యకు ఇచ్చిన అరుదైన గిఫ్టు ఏమిటంటే..

భార్యతో కలిసి వకీల్ సాబ్
లాక్ డౌన్ కాలంలో పలు సినిమాల నిర్మాణంపై దృష్టిపెట్టిన దిల్ రాజు విదేశాలకు వెళ్లి వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల ఆయన నిర్మించిన వకీల్ సాబ్ చిత్రం ఘన విజయం సాధించడంతో దిల్ రాజు సంతోషంలో మునిగితేలారు. ఆ సినిమాకు భార్యతో వెళ్లి సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశారు. సినిమా రిలీజ్ తర్వాత కూడా విజయంపై ఆయన మంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన తొలి వివాహ వార్షికోత్సవం వచ్చింది.

హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో
వాస్తవానికి దిల్ రాజు తన వివాహ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ హైదరాబాద్‌లో పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల తన నిర్ణయాన్ని వాపసు తీసుకొన్నారు. తన భార్యకు సర్ప్రైజ్ ఇచ్చే విధంగా విదేశాల్లో జరుపుకోనేందుకు ప్లాన్ చేసుకొన్నారు.

అమెరికాలో సురక్షితంగా
విదేశాలకు వెళ్లాలని దిల్ రాజ్ ప్లాన్ చేసుకొని.. ఏ దేశం అయితే సురక్షితంగా బాగుంటుందని ఆలోచించారు. ప్రస్తుతం అత్యంత సురక్షితంగా ఉన్న అమెరికా అయితే బాగుండుదని నిర్ణయం తీసుకొన్నారు. ఆ క్రమంలోనే తన భార్యకు వివాహా వార్షికోత్సవం గిప్టుగా అమెరికా పర్యటనకు వెళ్లినట్టు సమాచారం. అమెరికా పర్యటనతోపాటు స్పెషల్ గిఫ్టులు అందజేసినట్టు మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

స్నేహితులు, సన్నిహితులతోపాటు
ప్రస్తుతం అమెరికాలో దిల్ రాజు దంపతులు మంచి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలో భార్యతోపాటు పలు ప్రదేశాలను సందర్శించడంతోపాటు స్నేహితులు, సన్నిహితులు, అభిమానులను కలుస్తున్నారు అని తెలిసింది. ఏది ఏమైనా గత ఏడాది కాలంలో ఎలాంటి పర్యటనలకు దూరంగా ఉన్న దిల్ రాజు అమెరికా పర్యటన అనంతరం నూతన ఉత్సాహంతో సినిమా నిర్మాణాలపై మరింత జోష్‌ను కొనసాగించే అవకాశం ఉంది.
Recommended Video

దిల్ రాజు సినిమాలు ఇవే..
దిల్ రాజు కెరీర్ విషయానికి వస్తే.. మెగాపవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నాగచైతన్య, రాశీఖాన్నాతో థ్యాంక్యూ, వెంకటేశ్, వరుణ్ సందేశ్, అనిల్ రావిపూడితో ఎఫ్3, అంతేకాకుండా రౌడీ బాయ్స్, మరో రెండు హిందీ సినిమాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











