For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భార్యతో కలిసి ఆ దేశంలో వాలిపోయిన దిల్ రాజు: ప్రత్యేక అనుమతితో సీక్రెట్‌గా టూర్.. ఎందుకెళ్లారంటే!

  |

  డిస్టిబ్యూటర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే నిర్మాతగా ఎదిగాడు టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు ఇరవై ఏళ్లుగా పదుల సంఖ్యలో సినిమాలను నిర్మించిన ఆయన.. ఇప్పుడు బడా నిర్మాతగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇక, గత ఏడాది రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు.. భార్యను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరూ కలిసి విదేశీ పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

  నిర్మాతగా.. డిస్టిబ్యూటర్‌గా ప్రయాణం

  నిర్మాతగా.. డిస్టిబ్యూటర్‌గా ప్రయాణం

  నితిన్ నటించిన ‘దిల్' అనే సినిమాతో నిర్మాతగా మారాడు రాజు. మొదటిదే హిట్ అవడంతో సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఆయన.. టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో సినిమాలు నిర్మించాడు. అదే సమయంలో ఎన్నో చిత్రాలను పంపిణీ చేశాడు. ఇలా ద్విపాత్రాభినయం చేస్తూ టాలీవుడ్‌లో హవా చూపిస్తున్నాడు.

  పవన్‌ను ఒప్పించి.. రీఎంట్రీ ఇప్పించి

  పవన్‌ను ఒప్పించి.. రీఎంట్రీ ఇప్పించి

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రయత్నాలు జరిపారు. కానీ, ఎవరూ ఆయనను ఒప్పించలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఫలితంగా రీఎంట్రీ ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

  వకీల్ సాబ్‌తో వచ్చి... నష్టాలే మిగిలి

  వకీల్ సాబ్‌తో వచ్చి... నష్టాలే మిగిలి

  దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. శృతి హాసన్, అంజలి, అనన్య, నివేదా థామస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. ప్రతికూల పరిస్థితుల వల్ల నష్టాలే ఎదురయ్యాయి.

  భార్యతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్

  భార్యతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్

  దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి విధితమే. ఆమె పోయిన తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్న ఆయన.. 2020 మే 10న హైదరాబాద్‌కు చెందిన తేజస్వినీని వివాహం చేసుకున్నారు. ఇక, ఈమెతో కలిసి హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో దిల్ రాజు ‘వకీల్ సాబ్' మూవీ చూశారు. ఆ ఫొటోలు ఇటీవల తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

  భార్యతో కలిసి ఆ దేశంలో వాలిపోయి

  భార్యతో కలిసి ఆ దేశంలో వాలిపోయి

  వరుస సినిమాలతో తీరిక లేని షెడ్యూళ్లు గడుపుతోన్న దిల్ రాజు.. వివాహం తర్వాత తన భార్య తేజస్విని అలియాస్ వైఘ్యా రెడ్డితో కలిసి పెద్దగా టూర్లకు వెళ్లలేదు. లోకల్‌గా ఉండే దేవాలయాలను సందర్శించడం మినహా ఎక్కడికీ పర్యటించలేదు. ఇలాంటి సమయంలో తాజాగా వీళ్లిద్దరూ కలిసి అమెరికా పర్యటనకు వెళ్లినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  ప్రత్యేక అనుమతితో సీక్రెట్‌గా టూర్

  ప్రత్యేక అనుమతితో సీక్రెట్‌గా టూర్

  కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర రూపం చూపిస్తోంది. దీంతో కొన్ని దేశాలు భారతీయుల పర్యటనపై ఆంక్షలు విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు ప్రత్యేక అనుమతులు తీసుకుని మరీ తన భార్యతో కలిసి అమెరికా వెళ్లారట. అక్కడ మూడు వారాల పాటు ఎంజాయ్ చేయనున్నారని తెలిసింది. ఖాళీ సమయాన్ని సరదాగా గడిపేందుకే వెళ్లారని టాక్.

  #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
  తేజస్విని పరిచయం అవబోతున్నారు

  తేజస్విని పరిచయం అవబోతున్నారు

  బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన భార్య తేజస్వినీని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం తెరకెక్కించనున్న సినిమాకు ఆమె రచయితగా మారి కథను రెడీ చేసినట్లు ఆ మధ్య ఓ వార్త బయటకు వచ్చింది. ఆ కథకు మెరుగులు పెట్టేందుకు దిల్ రాజు ఓ టీమ్‌ను కూడా రెడీ చేశారనే టాక్ వినిపించింది.

  English summary
  Dil Raju got married in the presence of only close family members amid lockdown. He changed his second wife's name to Tejaswini. After Dil Raju's wedding, his fans started pouring love for the producer on social media. Meanwhile, Dil Raju's first selfie with wife Tejaswini went viral on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X