twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరుచూరి బ్రదర్స్‌ తిట్టారు.. ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్ళాం.. బాలయ్యకూ నచ్చలేదు: డైరెక్టర్‌ కామెంట్స్

    |

    ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమ యావత్ భారత దేశాన్ని ఆకర్షిస్తూ వస్తోంది. ఎన్నో గొప్ప సినిమాలు, మరెన్నో మెరుపురాని మైలురాళ్లు అన్నట్లుగా ఒక్కోమెట్టు ఎత్తుతూ ప్రపంచానికే తెలుగోడి సత్తా ఏంటో తెలిసే స్థాయికి ఎదిగింది టాలీవుడ్. అలాంటి ఈ చిత్రసీమలో ఎందరో మహా మహా దర్శకులు ఉన్నారు. అందులో ఒకరే డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి. తాజాగా ఈయన తన కెరీర్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

     ఆలీతో సరదాగా.. ఎన్టీఆర్‌ సంగతులు

    ఆలీతో సరదాగా.. ఎన్టీఆర్‌ సంగతులు

    బుల్లితెరపై ప్రసారమవుతున్న 'ఆలీతో సరదాగా' ప్రోగ్రాంలో పాల్గొన్న సెన్సేషనల్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి.. తన సినీ ప్రస్తానం గురించి వివరించాడు. ఈ సందర్బంగా తాను సినిమాల్లోకి ఎలా వచ్చానో వివరిస్తూ సీనియర్ నటుడు ఎన్టీఆర్‌‌తో అనుబంధం, సినిమా సంగతులు తదితర విషయాలు గుర్తు చేసుకున్నారు.

     ఇవన్నీ సినిమా ఆఫీసులా.. అనుకునేవాడిని

    ఇవన్నీ సినిమా ఆఫీసులా.. అనుకునేవాడిని

    తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని కోదండరామిరెడ్డి తెలిపారు. బోర్డులు చూసుకుంటూ 'ఓహో ఇవన్నీ సినిమా ఆఫీసులా..' అనుకుంటూ వాటిచుట్టూ తిరిగే వాడినని, చివరకు పీసీరెడ్డిగారి సహకారంతో సినీ దర్శకుడిగా సెట్ అయ్యానని చెప్పుకొచ్చారు కోదండరామిరెడ్డి.

    పరుచూరి బ్రదర్స్‌‌తో కలిసి ఎన్టీఆర్ వద్దకు

    పరుచూరి బ్రదర్స్‌‌తో కలిసి ఎన్టీఆర్ వద్దకు

    ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆయన తనను ఒక సినిమా చేయమన్నారని తెలుపుతూ ఆ సంగతులు పంచుకున్నారు కోదండరామిరెడ్డి. అప్పటికే ‘అనసూయమ్మగారి అల్లుడు' తీశాం. అది సూపర్‌ డూపర్‌ హిట్‌. దీంతో ‘తర్వాతి చిత్రం మనం చేస్తున్నాం బ్రదర్‌' అని ఎన్టీఆర్ అన్నారని ఆయన తెలిపాడు. సబ్జెక్ట్‌ రెడీ అవడంతో వినడానికి రమ్మన్నారని.. పరుచూరి బ్రదర్స్‌, తాను కలిసి వెళ్లామని చెప్పారు.

    పెద్దాయనతో అలా చెప్పినందుకు తిట్లు పడ్డా..

    పెద్దాయనతో అలా చెప్పినందుకు తిట్లు పడ్డా..

    కథ చెప్పిన తర్వాత ‘ఎలా ఉంది బ్రదర్‌' అని ఎన్టీఆర్ అన్నారని, దానికి సమాధానంగా ‘నాకు నచ్చలేదండీ' అని చెప్పానని.. ఆ వెంటనే ‘మీకు నచ్చకపోతే మేమెందుకు చేస్తాం. వదిలేయండి. తర్వాత ఎప్పుడైనా చేద్దాం' అని ఎన్టీఆర్ చెప్పారని కోదండరామిరెడ్డి అన్నారు. అయితే పెద్దాయనతో అలా చెప్పినందుకు బయటకు రాగానే పరుచూరి బ్రదర్స్‌ తనను తిట్టారని అన్నారు.

    ఫోన్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ..

    ఫోన్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ..

    అలా ఓ వారం గడిచిన తర్వాత ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, ‘సర్‌ సీఎంగారు లైన్‌లో ఉన్నారు' అని ఫోన్‌ ఇచ్చాడని.. ఆ ఫోన్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘బ్రదర్ ఆ కథ మాకు నచ్చింది. మీరు ఎలాగైనా చేసి పెట్టాలి' అన్నారని, దీంతో ఆ మాట కాదనలేక ఆ సినిమా చేశామని కోదండరామిరెడ్డి పేర్కొన్నారు.

    బాలకృష్ణ అన్న మాట.. చివరకు షూటింగ్

    బాలకృష్ణ అన్న మాట.. చివరకు షూటింగ్

    అయితే ఆ కథ బాలయ్య కూడా విన్నాడని.. అతనికీ నచ్చలేదని కోదండరామిరెడ్డి తెలిపారు. అదే ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ' సినిమా అని అన్నారు. ఎలాగోలా షూటింగ్‌ మొదలు పెట్టాం. బాలయ్యతో చాలా సరదాగా ఉండేది. అందులో బాలకృష్ణది పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ పాత్ర. ఒక షాట్‌లో ‘వన్‌మోర్‌' అని చెప్పడంతో ‘ఎందుకు సర్‌.. ఫ్లాప్‌ అయ్యే సినిమాకు వన్‌మోర్‌' అని బాలకృష్ణ అనడం ఇప్పటికీ గుర్తుందని కోదండరామిరెడ్డి చెప్పారు.

    English summary
    Senior director A. Kodandarami Reddy participated in Aalitho saradaga program and says about his cinema journey.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X