twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ఫోన్ ఎత్తలేదు... ఒక్కడు మూవీని పవన్ కల్యాణ్‌తో ప్లాన్.. అసలు కథ అలా...

    |

    టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాల సంఖ్య ప్రతి ఏడాది అంతకంతకూ పెరుగుతూనే ఉంది ఆల్ టైం బెస్ట్ యాక్షన్ సినిమాల్లో ఒక్కడు కూడా టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. అప్పటివరకు ఒక క్లాస్ హీరోగా ఉన్న మహేష్ బాబుకు ఆ సినిమా ఒక్క రాత్రిలోనే మాస్ అభిమానులను సంపాదించి పెట్టింది. ఒక్కడు సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.. అయితే ఒకానొక సమయంలో దర్శకుడు గుణశేఖర్ పై మహేష్ బాబు ఒక్కడు కథపై ఇంట్రెస్ట్ చూపలేదట. దీంతో ఆ సినిమా కథను మరో ఇద్దరు హీరోలకు చెప్పాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ రైటర్ తోట ప్రసాద్ వివరణ ఇచ్చారు.

    హై వోల్టేజ్ హీరోయిజం

    హై వోల్టేజ్ హీరోయిజం

    గుణశేఖర్ దర్శకత్వంలో ఎమ్ఎస్.రాజు నిర్మాతగా 2003లో విడుదలైన ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు.
    మహేష్ బాబు ఒకవైపు కబడ్డీ ప్లేయర్ గా మరోవైపు భూమికకు అండగా నిలబడుతూ హై వోల్టేజ్ హీరోయిజాన్ని చూపించాడు.
    సినిమాలో లవ్ స్టొరీ దానికి మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ అలాగే ప్రకాష్ రాజ్ విలన్ క్యారెక్టర్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఇక ఇలాంటి టు కథ చేసే అవకాశం వస్తే ఎవరు కూడా అంత ఈజీగా వదులుకోరు.

    బాక్సాఫీస్ కలెక్షన్లు

    బాక్సాఫీస్ కలెక్షన్లు


    మహేష్ బాబు జీవితంలో తెలుగులో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ ఉన్నప్పటికీ అందులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒక్కడు టాప్ లో ఉంటుందనే చెప్పాలి. కేవలం మహేష్ బాబు సినీ జీవితంలోనే కాకుండా. టాలీవుడ్ చరిత్రలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. అప్పటివరకు ఉన్న రికార్డులను సైతం ఒక్కసారిగా బ్లాస్ట్ చేసింది. మొదటిరోజు మహేష్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇక మొత్తం 13 కోట్ల బడ్జెట్ తో నిర్మాత ఎమ్మెస్.రాజు సినిమాను భారీగానే నిర్మించారు. అంతకు ముందు వరకు మహేష్ బాబు ఏ సినిమాను కూడా ఆ స్థాయిలో నిర్మించలేదు. ఇక కథ మీద నమ్మకం తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకొని 32 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకుంది. అప్పట్లో అయితే ఒక్కడు సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.

    మహేష్‌కు కథ చెబితే..

    మహేష్‌కు కథ చెబితే..

    దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమా కథను మొదటగా మహేష్ బాబుకే చెప్పాడు. అప్పటివరకు మహేష్ బాబు అలాంటి సినిమాలను చేసింది లేదు. అంతకుముందే టక్కరి దొంగ, బాబీ సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. తర్వాత సినిమాతో అయినా మినిమమ్ హిట్ అందుకోవాలని మహేష్ బాబు కొత్త తరహా కథలు వెతికే పనిలో పడ్డాడు. అప్పటికే తేజ దర్శకత్వంలో నిజం సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఎమ్మెస్ రాజు గుణశేఖర్ కలిసి మొదట కథను ఫిక్స్ చేసుకొని మహేష్ బాబు అయితే ఆ కథకు సెట్ అవుతాడని చాలా ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎలాగోలా ప్రాజెక్ట్ అయితే మహేష్ ముందు ఉంచారు. ఇక కథ అయితే చాలా బాగుందని చెప్పిన మహేష్ బాబు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో మొదట గుణశేఖర్ కాస్త కన్ఫ్యూజన్ లో పడ్డాడట.

    మహేష్‌ ఫోన్ ఎత్తకపోతే..

    మహేష్‌ ఫోన్ ఎత్తకపోతే..

    మహేష్ బాబుకు కథ చెప్పిన తర్వాత కొంత ఆలోచించుకోవడానికి సమయం తీసుకున్నాడు ఏమో అని అందుకే సైలెంట్ గా ఉన్నట్లు గుణశేఖర్ అనుకున్నాడట. ఇక రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఏదో ఒక విషయం అడిగేందుకు దర్శకుడు గుణశేఖర్ మహేష్ బాబు మేనేజర్ రాంబాబు ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అతను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సరైన సమాధానం ఇవ్వలేదట. మహేష్ కూడా ఫోన్ ఎత్తలేదు. చాలక్ సమయాల్లో మేనేజర్ కు ఫోన్ లిఫ్ట్ చేసి సార్ పడుకున్నాడు అని చెప్పేవారట. ఆ విధంగా మహేష్ బాబు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో గుణశేఖర్ కు కొత్త టెన్షన్ కూడా మొదలైందట.

    పవన్ కల్యాణ్, వెంకటేష్‌తో

    పవన్ కల్యాణ్, వెంకటేష్‌తో

    అలాగే దర్శకుడు గుణశేఖర్ అంతకుముందు మృగరాజు సినిమాతో డిజాస్టర్ కూడా అందుకున్నాడు. దానికి కూడా మహేష్ విముఖత చూపించి ఉండవచ్చుననే అనుమానాలు చాలానే వచ్చాయట. ఇంకా ఆ టెన్షన్ భరించలేక దర్శకుడు గుణశేఖర్ వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును మరొక హీరోతో తెరకెక్కించాలని ఆలోచించాడు. ఇక మరొక హీరో ఎవరు అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా మొదట పవన్ కళ్యాణ్ అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నారట. ఇక ఆయన కుదరకపోతే గనక వెంకటేష్ తో కూడా చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించారట.

    Recommended Video

    Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu
    చివరికి ఫోన్ ఎత్తడంతో ఒక్కడు సినిమా...

    చివరికి ఫోన్ ఎత్తడంతో ఒక్కడు సినిమా...


    ఒక గుణశేఖర్ ఆ విధంగా మరొక హీరోను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో వెంటనే మహేష్ బాబుకు మరొకసారి నిర్మాత కాల్ చేయడంతో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ విధంగా మహేష్ బాబు ఒక్కడు సినిమా రెండు వారాల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని సెట్స్ పైకి వచ్చింది. ఒక్కడు సినిమాలో మొదట ప్రకాష్ రాజ్ చేసిన విలన్ క్యారెక్టర్ ను గోపీచంద్ తో చేయించాలని అనుకున్నారు. కానీ అప్పటికే నిజం సినిమాలో మహేష్ బాబు గోపీచంద్ కాంబో సెట్టవ్వడం వలన దర్శకుడు గుణశేఖర్ తన ఆలోచనలు మార్చుకొని ప్రకాష్ రాజ్ ను ఫిక్స్ చేసుకున్నారు.

    English summary
    Director gunasekhar Okkadu project heroes before mahesh babu not interested
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X