సీతారామ శాస్త్రే దేవుడు, చిరంజీవే హీరో.. మారుతి ట్వీట్ వైరల్

తెలుగు భాషల్లో ఉన్న కమ్మదనం, తియ్యదనం మరో భాషలో కనిపించదు. తెలుగులో భాషలో ఉండే చమత్కారం మరెక్కడా కనిపించదు. అందుకే కాబోలు శ్రీకృష్ణ దేవరాయలంతటోడు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడు. ఇక ప్రపంచ దేశాలు సైతం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ మన భాషను కీర్తిస్తుంటారు. నేడు మన తెలుగు భాషా దినోత్సం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కవులు, రచయితలు, తెలుగు భాషాభిమానులు ప్రేమను చాటుకుంటున్నారు.

అందులో భాగంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "తలయెత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని, తల వంచి కైమోడ్చు తమ్ముడా, తెలుగు తల్లి నను కనిపెంచినాదని, కనుక తుల లేని జన్మమ్ము నాదని" అంటూ అందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Director Maruthi Tweet On Telugu Language Day

ఇక దర్శకుడు మారుతి తనకు తెలుగు భాషపై ఉన్న మమకారాన్ని మరో రూపంలో తెలిపాడు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ తెగ హల్చల్ చేస్తోంది. ' షేక్‌స్పియర్ గొప్పోడే, కానీ నాకు సీతారామ శాస్త్రే దేవుడు. అవేంజర్స్ అద్భుతమే, కానీ నాకు బాహుబలే బ్రహ్మాండం. విల్‌స్మిత్ తోపే, కానీ నాకు చిరంజీవే హీరో. ఇంగ్లీష్ ఇష్టమే, కానీ తెలుగంటే మాత్రం ప్రాణం' అంటూ తెలుగు వారందరికీ తెలుగుభాషాదినోత్సవశుభాకాంక్షలు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X