ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత రసవత్తరమో ఇది కూడా అలాంటిదే.. డైరెక్టర్
సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టెక్నాలజీ బాగా విస్తరించిన ఈ రోజుల్లో తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో విలక్షణత చాటుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన సినిమా గురించి చెబుతూ సినిమాను క్రికెట్ మ్యాచ్ తో పోల్చిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
'అ' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెలుగు తెరకు పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా 'కల్కి'. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న సందర్బంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ తన సినిమాను ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తో పోల్చాడు. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో.. థియేటర్లలో ప్రేక్షకులకు 'కల్కి' సినిమా కూడా అంతే ఉత్కంఠ కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తామని, నిర్మాత సి. కళ్యాణ్ గారు ఖర్చుకు వెనకాడకుండా తమ చిత్రాన్ని నిర్మించారని ఆయన చెప్పారు.

అసలే వరల్డ్ కప్ సీజన్.. పైగా ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే ఆసక్తే వేరు. ఈ సమయంలో సినిమా ప్రమోషన్ కోసం సరిగ్గా ఆ పాయింట్ తీసుకొని మాట్లాడటం దర్శకుడు ప్రశాంత్ వర్మలోని చురుకుదనానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ప్రేక్షక లోకం కూడా కేవలం ఈ పాయింట్ బేస్ చేసుకొని బాగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేవలం నటీనటుల్లోనే కాదు డైరెక్టర్ల లోనూ ఆకట్టుకునే కోణాలు ఉంటాయని ఈ రకంగా ప్రూవ్ చేశారు ప్రశాంత్ వర్మ.
శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కల్కి సినిమాను నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











