Don't Miss!
- News Shocking Video: గాల్లో ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు-10 మంది స్టాఫ్ దుర్మరణం..!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నేను తీసిన చెత్త సినిమా అదే.. ఇడియట్ 2 తియ్యాలని అనుకోని...: పూరి జగన్నాథ్ కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్న పూరి జగన్నాథ్ కేవలం సినిమాలతోనే కాకుండా తన రియల్ లైఫ్ క్యారెక్టర్ తో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక ఎపిసోడ్ లో జీవితానికి సంబంధించిన అంశాలను హైలెట్ చేస్తుంటాడు. అయితే పూరి కెరీర్ లో ప్లాప్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక దాదాపు అన్ని సినిమాలు తనకు ఇష్టమే అని చెప్పిన పూరి జగన్నాథ్ కేవలం ఒక ఒక్క సినిమా మాత్రం చెత్తగా తీశానని ఓపెన్ గా చెప్పాడు.
కెరీర్ మొదటి నుంచి
పూరి జగన్నాథ్ సినిమాలో ఎక్కువగా డైలాగ్స్ హైలెట్ అవుతుంటాయి. మాస్ ప్రేక్షకులకు నచ్చే సీన్స్ తో పాటు పంచ్ లు అలాగే బూతులను కూడా చాలా ఫన్ గా హైలెట్ చేస్తుంటాడు. ఇక పూరి టైటిల్స్ ఎంత భిన్నంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ మొదటి నుంచి ఒకే రకమైన ఫార్మాట్ లో హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు.
బాక్సాఫీస్ హిట్స్
బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పూరి ఆ తరువాత కొన్నేళ్ల వరకు అపజయం అనేది చూడలేదు. ఇడియట్, దేశముదురు, పోకిరి వంటి ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. అప్పట్లో పూరి సినిమాలు మిగతా భాషల్లో కూడా ఎక్కువగా రీమేక్ అయ్యేవి.
రవితేజతో హ్యాట్రిక్ హిట్స్
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ కు అప్పట్లో మంచి హైప్ ఉండేది. వారి కలయికలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి.. సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అంధించాయి. నేనింతే సినిమా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికి కమర్షియల్ అంతగా సక్సెస్ కాలేదు.
ఇడియట్ 2 నుంచి.. చెత్త సినిమా
ఇక రవితేజతో 5వ సారి ఇడియట్ 2 చేద్దామని అనుకున్నారు. కానీ కథ సరిగ్గా సెట్టవ్వలేదు. దీంతో దేవుడు చేసిన మనుషులు సెట్స్ పైకి వచ్చింది. ఇక తన జీవితంలో తీసిన అతి చెత్త సినిమా అదే అంటూ ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ ఓపెన్ గా చెప్పేశారు. అనుకున్న పాయింట్ ను సరిగ్గా చెప్పలేకపోయానని అనిపించింది. ఆ సినిమా తప్పితే మిగతా సినిమాలన్నీ కూడా తనకి నచ్చుతాయని వివరణ ఇచ్చారు.