ఇక్కడ అంతే, నాలాంటోడిని ఎవరూ ఎంకరేజ్ చేయరు: సంపత్ నంది

By Bojja Kumar

Recommended Video

Paper Boy Movie Success Meet పేపర్ బాయ్ సినిమా సక్సెస్ మీట్

ఒక డైరెక్టర్ అయుండి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నపుడు ఎవరూ ఎంకరేజింగ్‌గా మాట్లాడరు. ఇండస్ట్రీలోని వారైనా, మన వెల్ విషర్స్ అయినా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అయినా మనకు ఎందుకు ఈ ప్రొడక్షన్ అనే విధంగా నిరాశపరుస్తుంటారు, నాకు కూడా అలాంటి మాటలే వినిపించాయని దర్శకుడు సంపత్ నంది అన్నారు. ఆయన నిర్మించిన 'పేపర్ బాయ్' చిత్రానికి డీసెంట్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ఒక డీసెంట్ ప్రయత్నం చేశాం

ఒక డీసెంట్ ప్రయత్నం చేశాం

మా సినిమాలో స్టార్ హీరో లేడు, స్టార్ డైరెక్టర్ లేడు. అలాంటి సినిమా చేసినపుడు దీనికి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని, అద్భుతమైన రేటింగ్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక డీసెంట్ ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఒక డీసెంట్ రిజల్ట్ వస్తే చాలనుకున్నాన్నారు.

థియేటర్లు పెరిగాయి

థియేటర్లు పెరిగాయి

మాకు సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందంటే... తొలి రోజు శుక్రవారం 60 శాతం ఓపెనింగ్స్ వస్తే, శనివారం ఇంకా పెరిగింది. ఆదివారం నాటికి కేవలం హైదరాబాద్ లోనే 7 థియేటర్లు పెరిగాయి. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణమైన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి మరొక్కసారి థాంక్స్ అన్నారు.

మాది చాలా చిన్న సినిమా

మాది చాలా చిన్న సినిమా

సినిమాలో విజువల్స్ చూస్తే ఇది చాలా పెద్దగా కనిపస్తుంది కానీ మాది చాలా చిన్న సినిమా. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ వల్లే ఇది సాధ్యమైంది. ఇంత చిన్న ప్రయత్నం మీకు ఇంత బాగా రీచ్ అయినందుకు సంతోషంగా ఉంది.

కోట్లు సంపాదించడానికి రాలేదు

కోట్లు సంపాదించడానికి రాలేదు

నేనేదో కోట్లు సంపాదించడానికో, డబ్బే ముఖ్యం అనుకుని ఈ ప్రొడక్షన్లోకి దిగలేదు. ఇంతకు ముందు ఓ సినిమా చేసినా, ఇపుడు ఈ సినిమా చేసినా కారణం.... ఇండస్ట్రీ నన్ను ఎంకరేజ్ చేసింది, నేను ఇంకొకరికి అవకాశం ఇస్తే నాకు ఇంకో సినిమా చేసే అవకాశం ఇస్తుందని నమ్మాను కాబట్టే ప్రొడక్షన్లోకి దిగాను. ఈ ప్రొడక్షన్ ఇలా కంటిన్యూ చేస్తాను. నాకు ఓపిక ఉన్నంత వరకు, నేను రాస్తున్నంత వరకు ఇది కొనసాగుతుందని సంపత్ నంది స్పష్టం చేశారు.

పేపర్ బాయ్

పేపర్ బాయ్

సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరో హీరోయిన్లుగా సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన చిత్రం 'పేపర్ బాయ్'. హ్యాపీ ఎండింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, గాడ్ మస్ట్ బి క్రేజీ లాంటి షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ ఫిల్మ్ మేకర్ వి జయశంకర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.. ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమాకు డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X