సుశాంత్‌ను ప్రశాంతంగా ఉండనివ్వండి..మరణం వెనుకున్న కారణాన్ని కనుక్కోనివ్వండి,డైరెక్టర్ సుదీర్ఘ పోస్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత ఎన్నో ప్రశ్నలు తలెత్తున్నాయి. డిప్రెషన్ అనే వ్యాధిని నిర్మూలించాలని, డిప్రెషన్‌కు గురి కాకుండా ఉండాలని అందరూ చెబుతున్నారు. అందరూ కలిసి ఏకాకిని చేయకండని సూచిస్తున్నారు. డిప్రెషన్‌కు గురైన సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై సినీ లోకంతో పాటు సోషల్ మీడియా ప్రపంచం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్రమంలో ప్రతీ ఒక్క సెలెబ్రిటీ డిప్రెషన్ గురించి స్పందించారు. అనుష్క, దీపికా పదుకొణె వంటి వారు డిప్రెషన్ నుంచి ఎలా బయటకు రావాలో చెప్పుకొచ్చారు. తాజాగా ఓ డైరెక్టర్ సుశాంత్ మృతిపై స్పందిస్తూ.. డిప్రెషన్ గురించి చెప్పుకొచ్చాడు.

Recommended Video

Sushant Singh Rajput : Sri Reddy Comments Viral || వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో ?
అలా బతకనివ్వండి..

అలా బతకనివ్వండి..

సుశాంత్ మృతిపై ఏబీసీడీ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి స్పందిస్తూ.. ‘సుశాంత్‌ను అలా ప్రశాంతంగా బతకనివ్వండి.. పోలీసులను విచారించనివ్వండి.. మరణం వెనుక ఉన్న అసలు కారణాన్ని కనుక్కోనివ్వండి. మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా పని చేయడానికి అనువైనది..కానీ ప్రస్తుతం డిప్రెషన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి.. కొన్ని పనులు చేయడం ద్వారా డిప్రెషన్‌కు లోనుకాకుండా చేయగలమ'ని సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు.

ఎవరికీ ఎవరు లైఫ్ ఇవ్వడం లేదు.

ఎవరికీ ఎవరు లైఫ్ ఇవ్వడం లేదు.

సంజీవ్ రెడ్డి పోస్ట్ సారాంశం ఏంటంటే..‘ఆడిషన్స్‌కి వచ్చే నటీనటులను అవకాశం కోసం వచ్చే టెక్నీషియన్స్‌ని దయచేసి గౌరవంగా చూడండి. ఆ తరువాత నిర్ణయం తీసుకునే విషయంలో వాళ్లని ఎక్కువగా ఎదరుచూసేలా చేయకండి. మీ ప్రాజెక్ట్‌కి సూట్ అవుతారో లేదో మర్యాదగా చెప్పండి. ఇక్కడ ఎవరికీ ఎవరు లైఫ్ ఇవ్వడం లేదు.

అది ఇక్కడ కొత్తేమీ కాదు.

అది ఇక్కడ కొత్తేమీ కాదు.

మన తర్వాత వచ్చిన వ్యక్తి ఆకాశానికి ఎదిగిపోవడం, మన కంటే ముందు వచ్చిన వ్యక్తి అధ: పాతాళానికి పడిపోవడం ఇక్కడ కొత్తేమీ కాదు. ఒకరి అవసరం ఇంకొకరికి ఉంటుందని మరిచిపోవద్దు. తప్పుడు వాగ్దానాలు చేయకండి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పాల్సి వస్తే వాళ్లని సడెన్‌గా దూరం పెట్టకండి. ఫోన్‌లు ఎత్తకుండా, స్పందించకుండా ఉండకండి. వాళ్లతో కలిసి మాట్లాడండి. జరిగిన విషయం చెప్పండి. ఏదో విధంగా మీరు చేసే తదుపరి సినిమాలోనైనా అవకాశం ఇవ్వండి. ఒకరు అవకాశం ఇస్తేనే కదా మీరు ఈ స్థాయికి వచ్చింది.

 సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టకండి..

సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టకండి..

అమ్మాయిలు ఎంతో ధైర్యం చేస్తేగానీ సినిమాల్లోకి రాలేరు. అలాంటిది వస్తున్న కొద్దిపాటి వారిని కూడా సెక్సువల్‌గా ఇబ్బంది పెట్టకండి.. బయపడి పారిపోయేలా చేయకండి. ఆన్ సెట్‌లోగానీ, ఆఫ్ సెట్‌లోగానీ స్థాయిని బట్టి విలువ ఇవ్వకండి.. అందరినీ సమానంగా గౌరవించండి. మీ సహనటులు, సహా సాంకేతిక నిపుణులతో స్నేహపూర్వకంగా ఉండండి.

 కర్మ ఈజ్ బూమరంగ్..

కర్మ ఈజ్ బూమరంగ్..

మీతో కలిసి పని చేసే వాళ్లని సినిమా అయిపోగానే వదిలేయకండి. టచ్‌లో ఉండండి. వాళ్లేమైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తేయ మీకు వీలైనంత సాయం చేయండి. ఏవో కారణాల వల్ల ఇండస్ట్రీలో మీకొక వ్యక్తి నచ్చక పోతే వారి మానాన వారిని వదిలేయండి.. అంతే కాని కోపాలు, పగలు పెంచుకుని అతని గురించి, ఆమె గురించి చెడు ప్రచారం చెయ్యడం వాళ్లకి వచ్చే అవకాశాలు రానీయకుండా చేయడం మానుకోండి. మీరు ఎంత కష్టపడి ఇక్కడి దాకా వచ్చారో వాళ్లు అంతే కష్టపడి వచ్చారని గుర్తించండి. కర్మ తిరిగి మళ్లీ మనకే వస్తుందని మరిచిపోకండి.

వ్యక్తిగత దాడి..

వ్యక్తిగత దాడి..

ప్రియమైన రివ్యూ రైటర్స్, వెబ్ సైట్స్ ఓనర్స్ సినిమా ప్రయాణంలో మీ పాత్ర ఎంతో గొప్పది కానీ కొంతమంది కొన్ని సందర్భాలలో రివ్యూలు, ఆర్టికల్‌లు రాసేప్పుడు వ్యక్తిగత దాడి చేస్తున్నారు. ఫ్లాప్ హీరో, ఐరెన్ లెగ్ హీరోయిన్, బీ గ్రేడ్ యాక్టర్స్, ఇలా ఎన్నెన్నో మాటలు అనడం ద్వారా వాళ్లని ఒత్తిడికి గురి చేసి కుంగుబాటుకు గురయ్యేలా చేస్తున్నారు. ఇవి మానుకుంటే చాలా మంచిది.

ఎవరికో పుట్టిన బిడ్డను మన బిడ్డ..

ఎవరికో పుట్టిన బిడ్డను మన బిడ్డ..

ఇంకొకరి కష్టాన్ని దోచుకోకండి. ఇంకొకరి క్రెడిట్‌ని లాక్కునే ప్రయత్నం చేయకండి. కళాకారుడికి డబ్బు కన్నా కోరిక ఎక్కువ ఉంటుంది. అలా క్రెడిట్‌లు లాక్కుని వాళ్లని ఐడెంటిటి క్రైసిస్‌లో నెట్టకండి. ఒకరి క్రెడిట్ మనం వాడుకోవడం అంటే ఎవరికో పుట్టిన బిడ్డను మన బిడ్డ అని చెప్పుకున్నంత పాపం.

 శవాల మీద పేలాలు..

శవాల మీద పేలాలు..

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో అటెన్షన్ కోసం ఇంకొకరిని ట్రోల్స్‌తో బాధపెట్టకండి. వ్యూస్ కోసం యూట్యూబ్‌లో దారుణమైన హెడ్డింగ్, కంటెంట్‌తో బాధపెట్టకండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తున్న పనుల వల్ల కొంతమంది డిప్రెషన్‌లోకి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు. శవాల మీద పేలాల సామేత మీరు వినే ఉంటారు. ఇవన్నీ ఆచరించడం కొందరికి కష్టమే కావచ్చు కానీ మీరు మారి చేసే పనుల వల్ల చాలా మందిని డిప్రెషన్ బారిన పడకుండా చేస్తున్నారని గుర్తుంచుకోండ'ని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X