twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు అన్ని విషయాలు చెప్పాడు, ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై తేజ ఏమన్నారంటే...

    |

    తేజ దర్శకత్వంలో వచ్చిన 'చిత్రం' అనే మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో ఉదయ్ కిరణ్ వరుస విజయాలతో అప్పట్లో సంచలనం క్రియేట్ చేశారు. ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఊహించని విధంగా ఆయన కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ఉదయ్... వరుస పరాజయాలతో మరింత కృంగిపోయారు. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం తెలుగు సినీ అభిమానులను కలిచి వేసింది. ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం కావడానికి కారణాలు ఏమిటి? ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

    ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తే బావుంటుంది

    ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తే బావుంటుంది

    ఉదయ్ కిరణ్ జీవితంలోని వాస్తవాలు బయోపిక్ రూపంలో వస్తే బావుంటుందనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తం అవుతోంది. ఉదయ్ గురించి అన్ని విషయాలు తెలిసిన దర్శకుడు, ఆయన్ను సినిమా రంగానికి పరిచయం చేసిన తేజ... ఈ బయోపిక్ తీస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    నాకు అన్ని విషయాలు చెప్పాడంటున్న తేజ

    నాకు అన్ని విషయాలు చెప్పాడంటున్న తేజ

    ఉదయ్ కిరణ్ జీవితంలో ఏం జరిగింది? అతడు ఎక్కడ హర్ట్ అయ్యాడు అనే విషయాలు అన్నీ నాకు తెలుసు. ఉదయ్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. అతడి బాధ, సంతోషాలు అన్ని నాతో షేర్ చేసుకునేవాడు అని తేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    అందుకే ఆ ఆలోచన మానుకున్నాను

    అందుకే ఆ ఆలోచన మానుకున్నాను

    కానీ బయోపిక్ తీయడం వల్ల వచ్చే లాభం ఏమిటి? ఉదయ్ చనిపోయాడు.. ఆయనపై ఇపుడు సినిమా తీసి నేను డబ్బులు చేసుకోవాలా? అనే ఆలోచన వచ్చింది. అలాంటి ఆలోచన కూడా నాకు నచ్చడం లేదు. అందుకే ఉదయ్ కిరణ్ మీద సినిమా తీయాలనే థాట్ మానుకున్నట్లు తేజ స్పష్టం చేశారు.

    అలాంటివి ఎవరూ చూడరు

    అలాంటివి ఎవరూ చూడరు

    ఉదయ్ కిరణ్ జీవితంపై సినిమా తీస్తే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోలకు అదొక పాఠం అవుతుంది కదా? అనే ప్రశ్నకు తేజ సమాధానం ఇస్తూ.... సినిమాల్లో పాఠాలు చెప్పకూడదు, సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే. సినిమాల్లో పాఠాలు చెబితే ఎవరూ చూడరని తెలిపారు.

    నాలో ఐదు మంచి, ఐదు దరిద్రమైన గుణాలు ఉన్నాయి

    నాలో ఐదు మంచి, ఐదు దరిద్రమైన గుణాలు ఉన్నాయి

    నేను పుట్టినపుడే పది క్వాలిటీలతో పుట్టాను. అందులో ఒక ఐదు మంచి గుణాలు, ఐదు దరిద్రమైన గుణాల ఉన్నాయి. కోపం కూడా అందులో భాగమే. తీసుకుంటే మొత్తం తీసుకోవాలి లేదా వదిలేయాలి... అంటూ తేజ తనదైన శైలిలో స్పందించారు.

    English summary
    Uday Kiran told me all things. He shared his pain and joy with me. He's dead, and I have no intention of taking his biopic now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X