Sreeleela అందాన్ని పొగడ్తలతో ముంచెత్తిన బాలకృష్ణ.. నటసింహం చెప్పిన హిందీ డైలాగ్స్ ఏ సినిమాలోవి తెలుసా?

వేదిక ఏదైనా, సందర్భంగా, సంఘటన ఏదైనా నటసింహం నందమూరి బాలకృష్ణ మాట్లాడితే ఆ స్పీచ్ వైరల్ అవ్వాల్సిందే. పలు సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు అభిమానులను హుషారెత్తించాయి. ఆయన చెప్పే మాటలు సినీ ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయి.

అలాంటి నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన స్కంధ సినిమా ఈవెంట్‌లో తనదైన శైలిలో మాట్లాడి అందర్నీ ఆకట్టుకొన్నారు. అయితే హీరోయిన్ శ్రీలీల గురించి బాలయ్య చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య స్చీచ్‌లోని హిందీ డైలాగ్స్ గురించిన వివరాల్లోకి వెళితే..

Nandamuri Balakrishna Sreeleela

హిందీ డైలాగ్స్‌తో బాలయ్య కేక: ఇండియన్ సినిమా పరిశ్రమలో చరిత్ర తిరగరాసిన ఓ హిందీ సినిమాలోని పాపులర్ డైలాగ్స్‌ను ఉపయోగించి శ్రీలీల అందచందాలను నందమూరి బాలకృష్ణ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఆ హిందీ డైలాగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

Nandamuri Balakrishna Sreeleela

శ్రీలీలను ఉద్దేశించి బాలకృష్ణ: స్కంధ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. శ్రీలీల అందం, అభినయం, డ్యాన్స్ కలబోసిన అద్బుతమైన నటి అని అన్నారు. శ్రీలీలను పొగడ్తలతో ముంచెత్తుతూ.. శ్రీలీల పదహారు అణాల తెలుగు అమ్మాయి. చాలా మంది అమ్మాయిలు తెలుగు సినిమా పరిశ్రమలో నిలబడలేదు.

హిందీలో ఏమని అంటారంటే.. ఏ రామ్‌గఢ్ వాసియో.. అప్నే లడ్కీకో కౌన్‌సే చక్కీ ఔర్ ఆటా పిసాకే ఖిలాయేరే. జరా లడ్కీ కా హాత్ పైర్ ధేఖ్ (రామ్ గఢ్ వాసుల్లారా.. మన అమ్మాయికి ఎలాంటి పిండి పదార్థాలు తినిపించారో గానీ.. ఒక్కసారి ఆమె కాళ్లు చేతులు, అందాన్ని చూడండి) అన్నట్టు అంటూ బాలకృష్ణ డైలాగ్స్ కొట్టారు.

Nandamuri Balakrishna Sreeleela

శ్రీలీల సరస్వతి ప్రసాదం: శ్రీలీల గురించి చెప్పాలంటే.. అందం, అభినయం, నాట్యం అన్నీ కలగలిపి ఉన్న మంచి నటి. శ్రీలీల మనకు లభించిన సరస్వతి ప్రసాదం. ఆమెతో నేను భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాను. నటనపట్ల ఆమె డెడికేషన్ చూసి ఆశ్చర్యపోతున్నాను. చాలా సినిమాల్లో నటిస్తూ ఎలాంటి అలసట లేకుండా హుషారుగా కనిపిస్తుంది. ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అని బాలకృష్ణ అన్నారు.

Nandamuri Balakrishna

షోలే సినిమాలో బాసంతి గురించి: అయితే బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ ఇండియన్ సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన షోలే సినిమాలోని డైలాగ్స్. బసంతి క్యారెక్టర్ పోషించిన హేమా మాలిని అందం గురించి చెప్పే మాటలు. ఆ డైలాగ్స్‌తో శ్రీలీలను ప్రస్తావిస్తూ బాలకృష్ణ చెప్పడంతో క్రేజీగా మారాయి. ప్రస్తుతం బాలయ్య చెప్పిన షోలే సినిమా డైలాగ్స్ వైరల్‌గా మారుతున్నాయి.

 Sreeleela

స్టార్ హీరోయిన్‌గా శ్రీలీల: ఇక శ్రీలీల గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. పెళ్లి సందD, ధమాకా చిత్రాల్లో నటించిన ఆమె అందానికి, నాట్యాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాదాపు డజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఆమె జోరు, జోష్‌ను చూస్తే బాలకృష్ణ చెప్పిన విషయంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X