Kapil Dev రజనీకాంత్‌ మూవీలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్.. ఎలాంటి పాత్రలో అంటే?

క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులను గడగడ లాడించిన క్రికెటర్లు సినీ రంగంలోకి రావడం కొత్తేమీ కాదు.. గతంలో కూడా సందీప్ పాటిల్, సలీల్ అంకోలా లాంటి క్రికెటర్లు వెండితెరపైన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. అయితే తాజాగా క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా తమిళ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఆ సినిమా వివరాలు, ఆయన పాత్ర గురించిన వివరాల్లోకి వెళితే..

క్రికెట్ రంగాన్ని శాసిస్తూనే క్రికెటర్ కపిల్ దేవ్ వినోదరంగంతో కెరీర్‌ను కొనసాగించారు. వ్యాపార ప్రకటనల్లో కనిపిస్తూ స్టార్ మోడల్‌గా రాణించారు. ఎన్నో భారీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అయితే సినిమా రంగంలో అవకాశం వచ్చినా ఎందుకో ఆసక్తి చూపలేదు. అయితే చాలా సంవత్సరాల తర్వాత సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపడం ఆసక్తిగా మారింది.

Do You Know Cricket Legend Kapil Dev doing acting entry with Rajiniknaths Lal Salaam?

ఇటీవల హిందీతోపాటు పాన్ ఇండియా మూవీగా రిలీజైన 83 వరల్డ్ కప్ నేపథ్యంగా వచ్చిన చిత్రం 83 మూవీలో కూడా నటించే ఆఫర్ వచ్చింది. దాదాపు ఆయన బయోపిక్ మాదిరిగా రూపొందిన సినిమాలో కొన్ని పార్ట్స్‌లో నటించమని అడిగితే సున్నితంగా నిరాకరించారు. గతంలో కూడా ఎన్నో ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని నిరాకరిస్తూ రజనీకాంత్, ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ రూపొందించే లాల్ సలామ్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపారు.

లాల్ సలామ్ సినిమా ముంబైలో 80 దశకంలో సాగిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మురికివాడ ధారవి బ్రాక్ డ్రాప్‌గా, అక్కడ జరిగిన మాఫియా కార్యకాలపాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ముస్లిం మతానికి చెందిన గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషిస్తున్నారు.

Do You Know Cricket Legend Kapil Dev doing acting entry with Rajiniknaths Lal Salaam?

అయితే ముంబైలో జరిగిన లాల్ సలామ్ షూటింగ్ సందర్భంగా రజనీకాంత్‌తో కలిసి కపిల్ దేవ్ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అయితే ఈ సినిమాలో కపిల్ దేవ్ క్రికెటర్‌గానే కనిపించబోతున్నాడనే యూనిట్ వెల్లడించిన సమాచారం. అయితే గ్యాంగ్‌స్టర్, క్రికెటర్ మధ్య సంబంధాలు ఏమిటి? అనే ఓ క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది. సినిమా చూస్తే గానీ కపిల్ దేవ్ పోషించిన పాత్రపై ఓ అవగాహన రాకమానదని సినీ వర్గాలు అంటున్నాయి.

Do You Know Cricket Legend Kapil Dev doing acting entry with Rajiniknaths Lal Salaam?

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్‌తోపాటు అగ్ర నటులు నటిస్తున్నారు. విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాక ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X