స్నేహా రెడ్డి ముద్దు పేరు ఏంటి? భార్యను అల్లు అర్జున్ ఏమని పిలుస్తాడో తెలుసా?

సాధారణంగా సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు వాళ్ళ ఫ్యాన్స్. ఇక స్టార్ హీరోలకు పెళ్లయ్యింది అంటే వాళ్ళ భార్య, పిల్లల గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరికీ పరిచయమే. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం అతి కొద్ది మందికే తెలుసు. మరి ఆయన తన భార్యకు పెట్టిన ముద్దు పేరు ఏంటో? ఎంత మందికి తెలుసు? ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం పదండి.

బయట ఎక్కడ కనిపించినా వాళ్ళ ఫోటోలను క్లిక్ మనిపించడమే కాదు వాళ్లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి కూడా ఆరా తీస్తూ ఉంటారు. అలాగే తాజాగా అల్లు అర్జున్ పై పడింది అందరి కన్ను. అందులో భాగంగానే ఈ స్టైలిష్ స్టార్ తన భార్యను ప్రేమగా ఏమని పిలుస్తారు? అనే డౌట్ కు ఆన్సర్ వెతకడం మొదలు పెట్టారు.

Do you know how Allu Arjun Calls his wife What is Sneha Reddy nick name by Icon Star

అయితే అల్లు అర్జున్ తన భార్యను ముద్దుగా క్యూటీ అని పిలుచుకుంటారని తెలుస్తోంది. ఆయన పెట్టిన నిక్ నేమ్ కు తగ్గట్టుగానే స్నేహ రెడ్డి క్యూట్ గా, అందంగా హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని విధంగా ఉంటుంది. మొత్తానికి అల్లు అర్జున్ తన భార్యకు పర్ఫెక్ట్ నిక్ నేమ్ సెట్ చేశాడు అంటున్నారు. అల్లు ఫాన్స్.

ఇక ఈ హీరో తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కి కూడా సమ ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న బన్నీ ఇద్దరు పిల్లలతో పర్ఫెక్ట్ గా పర్సనల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ లైఫ్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్లు ప్లాన్ చేస్తూ కనిపిస్తారు అల్లు అర్జున్.

ఇక స్నేహారెడ్డి కూడా స్లిమ్ గా కనిపిస్తూ మంచి ఫిట్నెస్ ను మైంటైన్ చేస్తుంది. అప్పుడప్పుడు హీరోయిన్లకు మించిన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి కూడా చేస్తుంది. ఆమె కొన్ని రోజుల క్రితం ఓ యాడ్ కూడా చేసింది. స్నేహ రెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక్కటే మిగిలింది. మరి అల్లు ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా కనిపించిన రష్మిక మందన్న సెకండ్ పార్ట్ లో కూడా నటిస్తోంది.

ఈ మూవీ ఏడాది ఆగస్టు 15న థియేటర్లోకి రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, భాషలోనే కాకుండా ఈసారి జపాన్ లో ఉన్న పుష్పరాజ్ ఫాన్స్ కు కూడా ఆగస్టు 15నే మూవీని రిలీజ్ చేసి ట్రీట్ ఇవ్వబోతున్నారు మేకర్స్.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మూడవ పార్ట్ కూడా ఉంటుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. అయితే పార్ట్ 3 తెరకెక్కడానికి దాదాపు మూడేళ్ల సమయం పడుతుందని వార్తలు వస్తున్నాయి. అంతలోపు బన్నీ త్రివిక్రమ్, అట్లీలతో రెండు సినిమాలు పూర్తి చేస్తారని టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X