టాగోర్ మూవీని మిస్ చేసుకొన్న హీరోయిన్ ఎవరో తెలుసా? చిరంజీవితో బాలీవుడ్ తార నటించే ఛాన్స్ ఎలా చేజారిందంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన టాగోర్ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తమిళంలో సక్సెస్ సాధించిన రమణ సినిమా ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించాడు. ఏఆర్ మురగదాస్ కథను అందించిన ఈ సినిమాను మధు నిర్మించారు. అయితే 2003 సంవత్సరంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేయగా.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ మూవీ నుంచి తప్పుకొన్నది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే?

మెడికల్ మాఫియా, హాస్పిటల్‌లో అవినీతీ, అక్రమాలు ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి పక్కన ఇద్దరు హీరోయిన్లు నటించారు. అందులో ఒకరు జ్యోతిక కాగా, మరో హీరోయిన్ శ్రీయా సరన్. అయితే శ్రీయా స్థానంలో ముందుగా బాలీవుడ్ హీరోయిన్‌తో చర్చలు జరిపారు.

Do You Know How Madhuri Dixit Missed Offer With Chiranjeevi for Tagore Movie

అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ మాధూరీ దీక్షిత్‌ను నటింప చేయాలని అనుకొన్నారు. ఆ మేరకు చిత్ర యూనిట్ చర్చలు కూడా జరిపింది. ఈ సినిమా ద్వారా తెలుగులో నటించాలని, అలాగే టాలీవుడ్ ఎంట్రీకి ఇదే సినిమా కరెక్ట్ అని ఆమె కూడా భావించిదంట. ఇక ఈ సినిమాలో మాధురీ దీక్షిత్ హీరోయిన్ అని ఫిక్స్ అయ్యారు.

కానీ టాగోర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందు మాధురీ దీక్షిత్ ఇచ్చిన ట్విస్ట్‌కు చిత్ర యూనిట్ సందిగ్దంలో పడింది. దాంతో ఆమె స్థానంలో శ్రీయా సరన్‌ను తీసుకొన్నారు. లేకపోతే చిరంజీవి సరసన మాధిరు దీక్షిత్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరవయ్యేది. ఈ సినిమా చేసి ఉంటే.. ఆమె మరిన్నీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉండేదనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేశాయి.

Do You Know How Madhuri Dixit Missed Offer With Chiranjeevi for Tagore Movie

అయితే టాగోర్ సినిమా నుంచి మాధురీ దీక్షిత్ తప్పుకోవడానికి ప్రధాన కారణం ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా సమయంలో హిందీ సినిమా పూర్తికాకపోవడం, ఆ ఆలస్యం కారణంగా డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో చివరి నిమిషంలో ఆమె తప్పుకొన్నారు అని పేర్కొన్నారు.

టాగోర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ సుమారుగా 17 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా 18.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఇక ఈ సినిమా సుమారుగా 28 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఓవరాల్‌గా 10 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అప్పట్లో ఇంద్ర మూవీ సాధించిన 33 కోట్ల రికార్డు కలెక్షన్ల తర్వాత ఈ సినిమానే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X