Kamal Haasan ఆస్కార్‌కు కమల్ హాసన్ నటించిన 6 సినిమాలు.. ఆ మూవీ పేర్లు మీకు తెలుసా?

భారత దేశం గర్వించ దగిన విలక్షణ నటుడు కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటికే 6 దశాబ్దాలపాటు సినిమా రంగానికి సేవల అందించారు. త్వరలోనే ఆయన 70 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా కమల్ నటించిన 233 చిత్రాల్లో చాలా సినిమాలు అవార్డులు, రివార్డులు గెలుచుకొన్నాయి. అయితే ఆయన నటించిన సినిమాల్లో కొన్ని ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం మీకు తెలుసా?

కమల్ హాసన్ ఇప్పటి వరకు 233 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలకు భారీగా ప్రభుత్వ అవార్డులు లభించాయి. 3 నంది అవార్డులు, నాలుగు నేషనల్ ఫిలిం అవార్డులు, ఒకటి రాష్ట్రపతి అవార్డు, ఐదు ఫిలింఫేర్ అవార్డులు, డజనుకుపైగా ఫిలింఫేర్ సౌత్ అవార్డులు అందుకొన్నారు.

Do You Know Kamal Haasans 6 movies nominated for Oscar Awards: Here is the list

సినిమా రంగానికి కమల్ హాసన్ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం కూడా పలు అవార్డులతో సత్కరించిది. 1990 సంవత్సరంలో పద్మశ్రీ, 2014 సంవత్సరంలో పద్మభూషణ్, 2016 సంవత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అవార్డును అందుకొన్నారు.

ఇదిలా ఉండగా, కమల్ హాసన్ తన కెరీర్‌లో అరుదైన గౌరవాన్ని కూడా అందుకొన్నారు. ఆయన నటించిన సినిమాలు దేశీయంగానే కాకుండా విదేశీ సినీ ప్రముఖులను ఆకట్టుకొన్నాయి. అంతేకాకుండా ఆయన నటించిన 6 సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. అయితే తృటిలో ఆస్కార్ అవార్డులను చేజారడం అభిమానులకు నిరాశ కలిగించింది.

Do You Know Kamal Haasans 6 movies nominated for Oscar Awards: Here is the list

కమల్ హాసన్, డింపుల్ కాపాడియా, రిషి కపూర్ నటించిన సాగర్ చిత్రం బాలీవుడ్‌లో అద్బుతమైన విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా 1985లో ఆస్కార్‌కు నామినేట్ అయింది. కానీ విదేశీ సినిమాల జోరు ముందు నిలబడలేకపోయింది. ఇక కమల్ నటించిన మరో చిత్రం నాయకుడు 1987 సంవత్సరంలో నామినేట్ అయింది. అయితే బలమైన లాబీయింగ్ చేసుకొలేని పరిస్థితిలో అవార్డును కోల్పోయింది.

Do You Know Kamal Haasans 6 movies nominated for Oscar Awards: Here is the list

అలాగే కమల్ హాసన్ నటించిన దేవర్ మగన్ సినిమా అంటే తెలుగులో క్షత్రియపుత్రుడు సినిమా కూడా ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఇండియా వైడ్ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పీసీ శ్రీరాం దర్శకత్వం వహించిన కురుథిపునల్ సినిమాను ఆస్కార్ నామినేషన్‌ కోసం పంపించారు. ఈ సినిమా హిందీలో విజయవంతమైన ద్రోహ్ కాల్ సినిమాకు రీమేక్. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆస్కార్ సాధించలేకపోయాయి.

Do You Know Kamal Haasans 6 movies nominated for Oscar Awards: Here is the list

ఆస్కార్ లభించకపోయినా కమల్ ఉత్తమ చిత్రాలను అందిస్తూనే ఉండిపోయారు. 1996 సంవత్సరంలో ఇండియన్ సినిమా కూడా ఆస్కార్ అవార్డు నామినేట్ అయింది.ఆ తర్వాత షారుక్ ఖాన్‌తో కలిసి నటించిన హే రామ్ అనే సినిమా 2000 సంవత్సరంలో నామినేట్ అయ్యాయి. కానీ ఆస్కార్ అవార్డు సాధించకపోయినా.. ప్రేక్షకుల ఇచ్చిన ప్రశంసలే గొప్పగా మారాయని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X