Kamal Haasan హాలీవుడ్‌లో కమల్ హాసన్ పనిచేసిన విషయం తెలుసా? సూపర్ స్టార్ మూవీలో టెక్నిషియన్‌గా!
భారతీయ సినిమా పరిశ్రమలో లెజెండరీ యాక్టర్లలో కమల్ హాసన్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. బాలనటుడిగా ప్రవేశించి..డ్యాన్సర్‌గా పనిచేస్తూ.. హీరోగా మారిన ఆయన ఎన్నో అద్బుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.
అయితే నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, సాంకేతిక శాఖల్లో పలు విభాగాలపై పట్టు సాధించిన హీరోల్లో కమల్ స్టయిల్ వేరు. అయితే ఆయన భారతీయ సినిమాలకే కాదు.. హాలీవుడ్ సినిమాలకు కూడా పనిచేశారనే విషయానికి సంబంధించిన వీడియో, కమల్ హాసన్ ఇంటర్వ్యూ వైరల్ అవుతున్నది. ఏ హీరో సినిమా కోసం కమల్ హాసన్ హాలీవుడ్‌లో పనిచేశారంటే?

విక్రమ్ మూవీతో భారీ హిట్: కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్నారు. ఈ సినిమా కలెక్షన్లు ఆయన కెరీర్లోనే అత్యధికంగా వసూలు చేసిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా పాపులర్ షో ది కపిల్ వర్మ షోలో అనేక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
మేకప్ గురించి తెలుసుకోవాలని: కపిల్ శర్మ షోలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే ప్రాణం. సినిమా రంగంలో ప్రతీ విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకొంటాను. అన్ని శాఖలపై అవగాహన ఉండాలని ప్రయత్నిస్తుంటాను. కొన్ని సంవత్సరాల క్రితం మేకప్ రంగంలో ప్రోస్తటిక్ మేకప్ హాట్ టాపిక్. దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి పెరిగింది అని కమల్ హాసన్ చెప్పారు.

సిల్వెస్టర్ స్టాలిన్‌తో కలిసి: 1988 సంవత్సరంలో హాలీవుడ్‌లో సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలెన్‌తో రాంబో 3 సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఆ సినిమాలో ప్రోస్తటిక్ మేకప్‌ను ఉపయోగిస్తున్నారనే విషయం తెలిసింది. దాంతో నేను ఆ సినిమాకు మేకప్ ఆర్టిస్టుల్లో ఒకరిగా పనిచేశాను. సిల్వస్టర్ స్టాలెన్‌ను నేను మేకప్ చేసి దాని గురించి తెలుసుకొన్నాను అని కమల్ హాసన్ చెప్పారు.
రాంబో 3 మూవీ కోసం: రాంబో 3 సినిమాలో సిల్వెస్టర్ స్టాలెన్ ముఖంపై అయ్యే గాయాలకు సంబంధించిన మేకప్ నేను చేశాను. దాదాపు ప్రోస్తటిక్ మేకప్ గురించి తెలుసుకోవడానికి సుమారుగా రెండు నెలలు పట్టింది. ఆ సమయంలో ఆ మేకప్ టెక్నిక్‌ను నేర్చుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. నేను మాత్రమే నేర్చుకోవాలని అనుకొన్నాను. ఆ సమయంలో నా గురించి అక్కడి వారికి తెలియదు. నేను ఒంటరిగా రోడ్లపై తిరుగుతూ ఎంజాయ్ చేశాను అని కమల్ హాసన్ చెప్పారు.

36 ఏళ్ల తర్వాత మణిరత్నంతో: ఇక కమల్ హాసన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. విక్రమ్ సినిమాతో తనకు ఎదురేలేదని బాక్సాఫీస్ వద్ద నిరూపించుకొన్నారు. ప్రస్తుతం తన కెరీర్‌లో 234వ సినిమాను ప్రారంభించారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత మణిరత్న్ంతో కలిసి సినిమా చేస్తున్నారు. నాయకన్ తర్వాత మళ్లీ వారిద్దరూ కలిసి సినిమా చేయడం ఇదే. అలాగే ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD మూవీలో కమల్ విలన్‌గా కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











