IPL 2025: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నికర సంపద ఎన్నివేల కోట్లు? షారుక్, జూహీ నికర ఆస్తులు ఎన్ని వేల కోట్ల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) అంటే 18వ సీజన్‌కు రంగం సిద్దమైంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆతిథ్యం జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు (కేకేఆర్)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నది. ఇప్పటికే జట్టు యాజమాన్యం షారుక్ ఖాన్, జుహీ చావ్లా కోల్‌కత్తాకు చేరుకొని తమ జట్టుకు ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, KKR జట్టు నికర విలువ ఎంత? ఆ జట్టు యజమానులు షారుక్ ఖాన్, జూహీ చావ్లా నికర ఆస్తులు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ టోర్నమెంట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును 2007 సంవత్సరంలో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ కోనుగోలు చేసింది. ఈ జట్టు ఓనర్స్ షారుక్ ఖాన్, జూహీ చావ్లా, ఆమె భర్త జయ్ మెహతా కేకేఆర్ జట్టును అప్పట్లో సుమారుగా 75 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 3 బిలియన్ రూపాయలకు కొనుగోలు చేశారు.

ఇక 2024 ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ నిపుణులు అంచనా వేసిన ప్రకారం.. కేకేఆర్ జట్టు నికర విలువ ఊహకు అందని విధంగా పెరిగింది. తాజా అంచనా ప్రకారం జట్టు విలువ 9139 కోట్ల రూపాయలు అని లెక్క కట్టారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యంత సంపన్న జట్టులో కేకేఆర్ ఒకటిగా నిలిచింది.
ఇక కేకేఆర్ జట్టు యజమానిలో ఒకరైన షారుక్ ఖాన్ బాలీవుడ్‌లోనే కాకుండా ఐపీఎల్ ఓనర్లలో అత్యధిక సంపద కలిగిన వారిలో ఒకరిగా నిలిచారు. ఆయన నికర ఆస్తి విలువ సుమారుగా 7300 కోట్ల రూపాయలు. 2024 సంవత్సరంలో హరున్ ఇండియా రిచ్ జాబితాలో చేరడం ద్వారా ప్రపంచంలోనే సంపన్న వ్యక్తుల జాబితాలో ఒకరిగా చేరారు.
ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సహ భాగస్వామి జూహీ చావ్లా వ్యక్తిగతంగా నికర ఆస్తుల విలువ కూడా భారీగానే నమోదైంది. బాలీవుడ్‌లో అత్యంత సంపన్న హీరోయిన్లలో ఆమె మొదటి స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ సుమారుగా 4600 కోట్ల రూపాయలు. ఇండియాలో కూడా సంపన్న మహిళల్లో ఒకరిగా నిలిచారు.
ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2025 టోర్నీలో కేకేఆర్ జట్టు సభ్యుల వివరాల్లోకి వెళితే.. అజింక్య రహానే, రింకూ సింగ్, క్వింటన్ డీ కాక్, రెహామానుల్లా గుర్బాజ్, ఆంగ్‌క్రిష్ రఘువంశీ, రోమన్ పావెల్, మనీష్ పాండే, లవ్‌నిత్ సిసోడియా, వెంకటేశ్ అయ్యార్, అనుకుల్ రాయ్, మోయిన్ అలీ, రమన్ దీప్ సింగ్, అండ్రూ రస్సెల్, అన్రిచ్ నార్టే, వైభవ్ అరోరా, మయాంక్ మర్కండే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రానా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా సభ్యులుగా ఉన్నారు.
మార్చి 22వ తేదీన అట్టహాసంగా ఈడెన్ గార్డెన్‌లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజన్ టోర్నీలో తొలి మ్యాచ్‌ను బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో కేకేఆర్ తలపడనున్నది. ఈ ఆరంభ మ్యాచ్‌కు బాలీవుడ్ నుంచి సినీ తారలు, క్రికెటర్లు భారీగా తరలివస్తున్నారు. ఈ ప్రారంభ వేడుకలో పలువురు టాప్ సింగర్లు లైవ్ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్దమయ్యారు.


Click it and Unblock the Notifications











