కీర్తి సురేష్ తల్లితో చిరంజీవి నటించిన మూవీ తెలుసా? హీరోయిన్, సినిమా పేరు ఏమిటంటే?
తెలుగు సినిమా రంగంలోకి కొణిదెల శివశంకర ప్రసాద్ ప్రవేశించి ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవిగా.. ఆ తర్వాత ఇండియన్ సినిమా పరిశ్రమలో మెగాస్టార్ స్థాయిని అందుకొన్నారు. దాదాపు 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, అవమానాలను దాటుకొంటూ చిరంజీవి బాక్సాఫీస్ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఆసక్తికరమైన విషయాన్ని కీర్తి సురేష్‌తో పంచుకొన్నారు. ఆ వార్త, భోళా శంకర్ మూవీ వివరాల్లోకి వెళితే..
వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తర్వాత చిరంజీవి నటించిన చిత్రం భోళా శంకర్. ఈ సినిమా తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన వేదాళం మూవీకి రీమేక్. ఈ చిత్రంలో చిరంజీవి, కీర్తీ సురేష్ అన్నాచెల్లెల్లుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా కీర్తీ సురేష్ గురించి ప్రశంసలు కురిపించారు.

అయితే కీర్తి సురేష్, నేను అన్నాచెల్లెల్లుగా నటించాం. కానీ ఈ సినిమా వరకే అన్నాచెల్లెల్లం. తదుపరి ఏదైనా సినిమాల్లో అవకాశం వస్తే..హీరో,హీరోయిన్లుగా నటించాలని ఎదురు చూస్తున్నాం. అయితే కీర్తీ సురేష్ ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. నేను కీర్తి తల్లితో కలిసి పున్నమి నాగు చిత్రంలో నటించాం అని చిరంజీవి చెప్పారు.
కీర్తి సురేష్ తల్లి గురించిన వివరాల్లోకి వెళితే.. మేనకా సురేష్ దాదాపు 100 కిపైగా చిత్రాల్లో నటించడం, నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. ఆమె తమిళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో మాత్రం కేవలం రెండు సినిమాల్లో నటించింది. 1980 సంవత్సరంలో పున్నమినాగు చిత్రంలో చిరంజీవితో కలిసి నటించింది. ఆ తర్వాత సుబ్బారావుకు కోపం వచ్చింది అనే చిత్రంలో నటించింది.

చిరంజీవి తన కెరీర్‌లో తల్లి, కూతుళ్లతో కలిసి నటించిన అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నారు. దాదాపు 43 ఏళ్ల క్రితం మేనకతో నటిస్తే.. తాజాగా మేనక కుమార్తె కీర్తీ సురేష్‌తో కలిసి చిరంజీవి నటించారు. ఇలాంటి సుదీర్ఘమైన సినీ ప్రయాణం, అనుభవం మరో నటుడికి అరుదుగా కనిపిస్తుంది.

కీర్తి సురేష్ తల్లి మేనక వ్యక్తిగత వివరాల్లోకి వెళితే. ఆమె అసలు పేరు పద్మావతి అయ్యంగార్. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత మేనక సుపరిచితులుగా మారారు. 1979లో తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు.ఆ తర్వాత నిర్మాత జీ సురేష్ కుమార్‌ను వివాహం చేసుకొన్నారు. ఇప్పటి వరకు 125 చిత్రాల్లో నటించారు. మేనక, సురేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒకరు కీర్తీ సురేష్, మరొకరు రేవతి. రేవతి అస్టిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











