4 సార్లు ప్రేమలో పడ్డ రతన్ టాటా.. 1962 చైనా యుద్దం దెబ్బతో లవ్ బ్రేకప్!
దేశ పారిశ్రామిక రంగానికి దిశ నిర్దేశం చేసిన లెజెండరీ ఇండస్ట్రీలియస్ట్ రతన్ టాటా మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను వెంటాడుతున్నది. తన విజన్‌తో ఎన్నో రంగాల్లో తన ముద్రను చాటుకొంటూ గణనీయ ప్రగతిని సాధించారు. తాను ప్రారంభించిన అన్ని ఉత్పత్తుల్లో టాప్ రేంజ్‌ను సొంతం చేసుకొన్నది. ఎన్నో లక్షల కుటుంబాలను తీర్చిదిద్దిన అలాంటి దిగ్గజ నేత మాత్రం తన కుటుంబాన్ని ఏర్పరుచులేకపోయారు. అందుకు సంబంధించిన కారణాల్లోకి వెళితే..
పారిశ్రామిక రంగంలోనే కాకుండా వ్యక్తిగతంగా రతన్ టాటా సౌందర్య పోషకుడు. ఆయన తన జీవితంలో నాలుగైదు సార్లు ప్రేమలో పడ్డారు. అయితే ఆయన ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోలేకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని పెళ్లి వరకు వచ్చి ఆగిపోవడం.. కొన్ని తన తల్లికి నచ్చితే.. మరొకొన్ని తనకు నచ్చకపోవడం జరిగాయట.

రతన్ టాటా అమెరికాలో చదువుకొనేటప్పుడు అక్కడ ఓ యువతితో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకొందామని అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. ఆయనతోపాటు ఆ యువతి కూడా తనతో రావాలనుకొన్నది. కానీ అదే సమయంలో భారత, చైనా మధ్య యుద్దం కొనసాగింది. దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. దాంతో వారిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది.
చైనా యుద్దం ముగిసి ప్రశాంత పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అప్పటికే ఆ యువతి మరొకరితో రిలేషన్ పెట్టుకొన్నది. దాంతో రతన్ టాటాను వదిలేసి మరోకరిని పెళ్లి చేసుకొన్నది. దాంతో ఆయన జీవితంలో తొలి బ్రేకప్ ఏర్పడింది. పెళ్లి చేసుకొందామని అనుకొన్న సమయంలో ఇలాంటి జరగడంతో ఆయన అలాంటి వాటికి చాలా కాలం దూరంగా ఉంటూ వచ్చారు.

తాను పెళ్లి చేసుకోకపోవడానికి నాలో ఉండే భయమే కారణం అని రతన్ టాటా ఓ సందర్భంలో చెప్పారు. నాలుగు సార్లు పెళ్లి చేసుకొందానమి అనుకొన్నాను. కానీ ప్రతీసారి ఏదో కారణంతో వెనుకడుగు వేశాను. పెళ్లి అంటే భయంతో ఆ నిర్ణయం మార్చుకొన్నాను. అయితే పెళ్లి విషయంలో నేను ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. తన జీవితంలో బాలీవుడ్ నటి సిమి గరేవాల్‌తో కూడా ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర అనారోగ్యంతో ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ తన 86వ ఏట కన్నుమూశారు. ఆయన మరణవార్తతో సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక రంగాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











