బిగ్‌బాస్ హోస్ట్‌గా సల్మాన్ రెమ్యునరేషన్ ఎంత? కండల వీరుడి ఆస్తులు విలువ ఎన్ని వేల కోట్లంటే?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రికార్డు స్థాయిలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ 18 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం ద్వారా ఇండియాలో అరుదైన గుర్తింపును పొందారు. అయితే ఈ షోను ఎన్నో సీజన్లుగా ఒంటి చేత్తో నడిపిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను రంజింప చేస్తున్నాడు. అయితే తాజాగా 18వ సీజన్ తనదైన స్టయిల్‌లో స్టార్ట్ చేశారు. అయితే ఈ షో నిర్వహించినందుకు సల్మాన్ రెమ్యునరేషన్ ఎంత? సినిమాకు ఎంత పారితోషికం తీసుకొంటాడు? ఇప్పటి వరకు ఆయన ఆస్తుల విలువ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
సల్మాన్ ఖాన్ హిందీ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే స్టార్ హీరో. ఈ విషయం అందరికి తెలిసిందే. ఆయన తాను నటించే ఒక్కో సినిమాకు సుమారుగా 200 కోట్ల నుంచి 250 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకొంటాడు. హిందీలో షారుక్, అమీర్ ఖాన్‌తో సమానంగా రెమ్యునరేషన్ తీసుకొంటూ ఉంటారు.

ఇక సినిమాలే కాకుండా యాడ్స్‌లో నటించేందుకు భారీగా పారితోషికాన్ని అందిపుచ్చుకొంటారు. కొన్ని సెకన్లపాటు నటించే వ్యాపార ప్రకటన కోసం ప్రొడక్ట్‌ను బట్టి సుమారుగా 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇలా రకరకాలుగా ఆయన తన సంపాదన ఖాతాలో వేసుకొంటారు. ఇదే కాకుండా పెళ్లిలో డ్యాన్సులు, ఈవెంట్స్, రకరకాలుగా సంపాదిస్తుంటారు.
అలాగే బిగ్‌బాస్ షోకు హోస్టుగా వ్యవహరించే సల్మాన్ ఖాన్ ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకొనే హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కేబీసీ కోసం సుమారుగా సీజన్ మొత్తానికి 70 కోట్ల తీసుకొంటే.. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోకు కపిల్ శర్మ 60 కోట్ల రూపాయల మేర ఫీజు వసూలు చేస్తాడు.

కానీ సల్మాన్ మాత్రం వీరిద్దరని మించి.. ఇండియాలో ఏ హెస్ట్ అందుకోని విధంగా పారితోషికం అందుకొంటారు. ఆయన సుమారుగా 15 వారాల కోసం 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తారని తెలిసింది. బిగ్‌బాస్ హోస్టుల్లో నాగార్జున, మోహన్ లాల్, కిచ్చ సుదీప్, తాజాగా విజయ్ సేతుపతి కంటే సల్మాన్ రెమ్యునరేషన్ ఎక్కువ అని తెలిసింది.
సల్మాన్ ఖాన్ నికర ఆస్తుల విలువ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కంపెనీ ఫోర్బ్ అంచనాల ప్రకారం.. 2024లో ఆయన ఆస్తుల విలువ భారీగానే ఉంది. ఈ సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం.. సల్మాన్ ఆస్తుల విలువ 3000 కోట్ల రూపాయలు. ఇండియన్ సినిమా పరిశ్రమలో షారుక్, అమితాబ్ తర్వాత సల్మాన్ అత్యధిక ఆస్తులు ఉన్న హీరోగా ప్రస్తుతం ఓ ఘనతను అందుకొన్నారు.


Click it and Unblock the Notifications











