Sharwanand wed Rakshitha హీరో శర్వానంద్ భార్య ఏ టాప్ హీరో అభిమానో తెలుసా? వైరల్‌గా రిసెప్షన్ వీడియో

తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో శర్వానంద్ వివాహం రక్షితా రెడ్డితో వైభవంగా జరిగింది. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగిన వివాహాం ప్రైవేట్ కార్యక్రమంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు, అతికొద్ది మంది స్నేహితులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన డిన్నర్ వేడుకలో శర్వానంద్ భార్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియో వెనుక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే?

జైపూర్‌లో జరిగిన వివాహానికి రాంచరణ్, సిద్దార్థ్, అదితిరావు హైదరీ, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. జూన్ రెండో తేదీన మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సిద్దార్థ్ పాట పాడటం కూడా వైరల్‌గా మారింది. మూడు రోజులపాటు జైపూర్‌లో శర్వానంద్ పెళ్లి ఆర్బాటంగా జరిగింది.

Do You Know Sharwanands wife Rakshitha Reddy is fan of Nandamuri Balakrishna fan?

ఇక పెళ్లి అనంతరం సినీ పరిశ్రమ ప్రముఖులకు, అలాగే సినీ, మీడియా ప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు నందమూరి బాలకృష్ణ, రాంచరణ్, రానా దగ్గుబాటి, నిఖిల్, శివబాలాజీ, మంత్రి కేటీఆర్, సినీ నటి అమల, శ్రీనివాస యాదవ్ తదితరులు హాజరయ్యారు.

Do You Know Sharwanands wife Rakshitha Reddy is fan of Nandamuri Balakrishna fan?

శర్వానంద్ పెళ్లి విందు వేడుకకు నందమూరి బాలకృష్ణ వచ్చి కొత్త పెళ్లి జంటను ఆశీర్వదించారు. బాలకృష్ణ వచ్చి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తుండగా.. శర్వానంద్‌ ఆనందపడిపోయారు. పక్కనే ఉన్న భార్యను పరిచయం చేస్తూ.. ఈమె మీకు పెద్ద ఫ్యాన్ బాస్ అంటూ శర్వానంద్ అన్నారు. దాంతో ఆనందపడిపోయిన బాలకృష్ణ తన చేతిని రక్షితా రెడ్డి తలపై పెట్టి ఆశీర్వదించారు.

Do You Know Sharwanands wife Rakshitha Reddy is fan of Nandamuri Balakrishna fan?

సినీ నటుడు బాలకృష్ణకు శర్వానంద్ పరిచయం చేస్తూ మీ ఫ్యాన్ అంటూ చెబుతున్న విషయాన్ని రిసెప్షన్‌కు వచ్చిన వ్యక్తి షూట్ చేసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దాంతో ఈ వీడియో వైరల్ అయింది. భారీగా వ్యూస్ ఈ వీడియో సొంతం చేసుకొన్నది. బాలయ్య అభిమానులు ఆనందంతో రీట్వీట్ చేస్తూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

శర్వానంద్‌ భార్య రక్షితా రెడ్డి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఏపీలో మాజీ మంత్రి, టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సమీప బంధువు. ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి హైకోర్టు లాయర్. ప్రస్తుతం రక్షితారెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమెరికాలో భారీగా అంటే వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని సినీ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X