24 ఫ్లాపులతో రాంగోపాల్ వర్మ రికార్డు.. 25 వరుస ఫ్లాప్స్ ఇచ్చి.. రికార్డు బ్రేక్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

సినిమా పరిశ్రమలో హిట్స్, ఫ్లాప్స్ సాధారణం. హిట్టు కొట్టిన వాళ్లు టాప్ రేంజ్‌లో ఉంటారు. ఫ్లాప్ ఇచ్చిన దర్శకులు, స్టార్లు, నిర్మాతలు కనిపించకకుండా పోతారు. అయితే బాలీవుడ్‌లో వరుసగా 25 ఫ్లాపులు ఇచ్చి కూడా సినిమాలు తీస్తున్న ఫిల్మ్ మేకర్ ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. 24 ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడు రాంగోపాల్ వర్మ‌ను బీట్ చేసిన ఓ దర్శకుడు ఉన్నారంటే ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. 25 ఫ్లాపుల తర్వాత బాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్న నిర్మాత, దర్శకుడి గురించిన వివరాల్లోకి వెళితే..

ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యధిక ఫ్లాపుల తీసిన వారిలో రామ్ గోపాల్ వర్మ రెండో స్థానంలో ఉన్నారు. ఆర్జీవి ఇప్పటి వరకు 24 ఫ్లాపులు తీసిన ఘనతను సొంతం చేసుకొన్నారు. ఆయన తర్వాత దర్శకుడు ప్రియదర్శన్ 14 ఫ్లాపులు, సతీష్ కౌశిక్ 10 ఫ్లాపులతో కెరీర్ కొనసాగించారు.

Ram Gopal Varma

మహేష్ భట్ ఫ్యామిలీ నుంచి బాలీవుడ్‌లోకి ప్రవేశించిన దర్శకుడు విక్రమ్ భట్. 1994లో తొలిసారి దర్శకత్వం వహించడం ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. గత 29
సంవత్సరాల్లో విక్రమ్ భట్ 33 సినిమాలు తీశాడు. అందులో 25 ఫ్లాపులు ఉండటం గమనార్హం.

విక్రమ్ భట్ తన కెరీర్ ఆరంభిస్తూ.. మదోష్ అనే సినిమాకు దర్శకుడిగా ఇండియన్ సినిమాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన తీసిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్. అనంతరం 1998లో అమీర్ ఖాన్‌తో తీసిన గులామ్ సూపర్ హిట్. ఈ సినిమా తర్వాత సెటిల్ అవుతాడనుకొంటే.. ఆయన ఫ్లాపుల పర్వంగా నిరాటంకంగా కొనసాగింది.

Vikram Bhatt

దర్శకుడు విక్రమ్ భట్ తన 29 సంవత్సరాల కెరీర్‌లో 33 సినిమాలు తీస్తే.. అందులో మూడు సినిమాలు హిట్స్, మూడు సినిమాలు యావరేజ్, ఒకటి సూపర్ హిట్, మరోటి బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువ మూవీస్ హారర్ కామెడీలే కావడం గమనార్హం.

Vikram Bhatt

అయితే విక్రమ్ భట్ రికార్డు స్థాయిలో ఫ్లాపులు ఇచ్చినప్పటికీ.. ఆయన ప్రయోగాలు చేయడం మానలేదు. ప్రతీ సినిమాను ప్రయోగం చేస్తూనే ముందుకెళ్లాడు. 3డీ ఫార్మాట్‌లో హాంటెడ్, తీశాడు. వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలో జుదా హో కే బీ అనే సినిమాను తీశాడు. తన కెరీర్‌లో టెక్నాలజీ పరంగా అనేక సినిమాలు తీసి ప్రయోగాలు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X