అరుంధతి చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గ్లామర్ డాల్
అనుష్క నటించిన అరుంధతి చిత్రంలో అరుంధతి చిన్ననాటి పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందిన అప్పటి బాల నటి దివ్య నగేష్ గుర్తుందా? ఆమె పవర్ ఫుల్ మేకోవర్, లుక్స్ ను తెలుగు ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. అనుష్క కెరీర్ ను మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి. ఈ సినిమాలో అనుష్క శెట్టి చిన్ననాటి పాత్రలో నటించిన ఆ చిన్నారి ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందో తెలుసుకుందాం పదండి.
'సూపర్'సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి ఆ తర్వాత కోడి రామకృష్ణ 'అరుంధతి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమాలో అనుష్క నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో బొమ్మాళి అంటూ సోనూసూద్ చూపించిన రాక్షస నటన కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ హిట్ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. అంతేకాదు ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు దాదాపు రూ. 40 కోట్ల లాభం కూడా వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజై పుష్కరం దాటాక బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు.
కరీనా కపూర్ 'అరుంధతి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని భావించింది. అయితే ఎందుకో అది వర్కవుట్ కాలేదు. ఈ సినిమా హిందీ హక్కులను అల్లు అరవింద్ భారీ ధరకు కొనుగోలు చేశారు. అంతేకాదు ఈ చిత్రాన్ని హిందీలో మధు మంతెనతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు.

అదే సమయంలో అరుంధతి హిందీ వెర్షన్‌కి తెలుగు దర్శకుడు దర్శకత్వం వహిస్తాడా, లేదా ఈ రీమేక్‌కి హిందీ దర్శకుడు దర్శకత్వం వహిస్తాడా అనే చర్చ జోరుగా సాగింది. కానీ ఎట్టకేలకు ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ బుల్లితెరపై రిలీజ్ కావడం, మంచి టీఆర్పీ రేటింగ్ రావడం కూడా జరిగిపోయింది. కానీ రీమేక్ చేయలేకపోయారు.
కాగా అరుంధతిలో అనుష్క చిన్ననాటి పాత్రలో నటించిన దివ్య నగేష్ ఇప్పుడు పెద్దదై పోయింది. అరుంధతిగా పాపులర్ అయిన దివ్య నగేష్ 1988 ఏప్రిల్ 13న కేరళలోని అలప్పుజలో జన్మించింది. తర్వాత ఆమె కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. 2014లో ఆమె తమిళ చిత్రం సేవమ్‌లో బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది.
అంతేకాదు దివ్య నగేష్ తెలుగు సినిమాల్లో నటించింది. ఆ అమ్మాయి చాలా మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు తెలుగులో నేను నాన్న అబద్దం సినిమాలో కూడా దివ్య నగేష్ హీరోయిన్ గా నటించింది. అరుంధతి మూవీతో చిన్నప్పుడే మంచి పాపులారిటీని సంపాదించుకున్నటికి అది ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

దివ్య నగేష్ కు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన కొన్ని సినిమాలతో ఆమెకు పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. అందుకే ప్రస్తుతం ఫోటో షూట్‌లతో కాలం వెల్లదీస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. దివ్య నగేష్ కు హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందన్న నమ్మకం కూడా లేకపోవడంతో ఇప్పుడు వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు.
అరుంధతి ఫేమ్ దివ్య నగేష్ వయసు 35 ఏళ్లు దాటింది. ప్రస్తుతం ఎవరితోనూ ఆమె డేటింగ్ చేయడం లేదు. ఒంటరిగా ఉంటున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న దివ్య నగేష్ త్వరలో సింగిల్‌గా సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications











