Kalki 2898 AD మూవీలో కృష్ణుడికి వాయిస్ ఓవర్ ఇచ్చిందో ఎవరో తెలుసా?
చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా మళ్ళీ చాలా కాలం తర్వాత అది కూడా మన తెలుగు సినిమా నుంచి వచ్చింది. సరిగ్గా ఏడాదిలో మరో సినిమాతో వచ్చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పాన్ ఇండియా పవర్ ఏంటో తన నయా చిత్రం "కల్కి 2898 ఎడి" తో చూపించాడు.
కాగా ఈ సినిమా నేడు విడుదల అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రావడంతోనే అనుకున్నట్టుగా అనేక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ నింపేసాడు. సరిగ్గా సినిమా రిలీజ్ ముందు రోజే ఈ చిత్రంలో యంగ్ నటులు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లు కూడా ఉన్నారని తాను రివీల్ చేయగా ఇప్పుడు సినిమా చూసి షాక్ అయ్యిన ఎలిమెంట్స్ లో వారి పాత్రలు కూడా ఒకటి.

ఇక వీటితో పాటుగా సినిమాలో మహాభారతం సీక్వెన్స్ అయితే అందరికీ గూస్ బంప్స్ ని అందించింది. సినిమా ఆరంభంతోనే ఒక ఊహించని విజువల్స్ తో నాగ్ అశ్విన్ క్రేజీ ట్రీట్ అందించగా ఇందులో అసలు ఇంకా ఊహించని అంశం ఏదన్నా ఉంది ఆ శ్రీకృష్ణ భగవానుడి రూపం అని చెప్పాలి.
ముఖాన్ని చూపించకుండా బ్యాక్గ్రౌండ్ తేజస్సుతో కేవలం వాయిస్ ని మాత్రమే వినిపించిన నాగ్ అశ్విన్ ఇదే రోల్ తో సినిమాలో ఆడియెన్స్ కి ఓ రేంజ్ హై ని అందించాడు. కాగా ఈ కృష్ణ అవతారం పోషించింది ఎవరు అనేది పక్కన పెడితే అసలు ఈ పాత్రకి వచ్చిన గాంభీర్యం ఆ గొంతులోనే వినిపించింది.
మరి ఇది తెలుగులో వెంటనే గుర్తు పట్టలేకపోయారు కానీ అసలు ఈ వాయిస్ ఓవర్ ని ఇచ్చిందో ఎవరో తెలిస్తే డెఫినెట్ గా షాకవుతారు. అది మరెవరో కాదు జస్ట్ తన బేస్ వాయిస్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న తమిళ నటుడు అర్జున్ దాస్ అట. తాను "విక్రమ్", పవర్ స్టార్ "ఓజి" సినిమాలకి ఇచ్చిన వాయిస్ ఓవర్లు ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరి ఇప్పుడు తనతో నాగ్ అశ్విన్ కృష్ణుడి పాత్రకి డబ్బింగ్ చెప్పించాడు. అయితే దీనిని గమనించిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయగా అది నిజమే అని అర్జున్ దాస్ ఒప్పుకున్నాడు. ఇలా అసలు ఆ పాత్రకి ఎవరు డబ్బింగ్ అందించారు అనేది మంచి క్రేజీ అంశంగా మారింది.
ఇక ఈ భారీ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, పశుపతి శోభన, దీపికా పదుకొనె తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా సనా (సంతోష్ నారాయణన్) సంగీతం అందించాడు. అలాగే అశ్వినీదత్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











