సన్నాఫ్ సత్యమూర్తి చిన్నారి గుర్తుందా? ఇప్పుడు చూడండి ఎంత హాట్‌గా ఉందో.. (వీడియో)
బాలనటులుగా కెరీర్ ను ప్రారంభించి హీరోలు, హీరోయిన్లు అయిన స్టార్లు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతోమందిని మెప్పించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కొందరు మధ్యలో చదువును నెగ్లెట్ చేయకుండా దాన్ని కూడా కొనసాగిస్తూ సినిమాలు చేస్తున్నారు. మరికొందరు చదువు కోసం ఇండస్ట్రీకి దూరమై ఒక వయస్సు వచ్చాక మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఏడాది హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ .. అలా వచ్చినవాడే. నేనున్నా నాయనమ్మ అంటూ ఇంద్రలో తొడకొట్టిన ఈ బుడ్డోడు ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. ఇక ఇలానే ఎంతోమంది బాలనటులు ఇండస్ట్రీకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో బేబీ వర్ణిక కూడా చేరింది. ఎవరి వర్ణిక? ఏ సినిమాలో చేసింది?అనేగా డౌట్. కంగారెందుకు..తెలుసుకుందాం పదండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో జులాయి తరువాత వచ్చిన చిత్రమ్ సన్నాఫ్ సత్యమూర్తి. 2015 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత నటించింది. ఒక కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది.. ? చిన్నకొడుకుగా హీరో ఆ కుటుంబాన్ని ఎలా నిలబెట్టాడు .. ? అనేది సన్నాఫ్ సత్యమూర్తి కథ.

ఇందులో అల్లు అర్జున్.. చిన్న కొడుకుగా కనిపించగా .. పెద్ద కొడుకుగా వెన్నెల కిషోర్ కనిపిస్తాడు. తండ్రి ప్రకాష్ రాజ్ ప్రమాదంలో చనిపోతే.. అన్న మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. కుటుంబాన్ని పోషించే బాధ్యత బన్నీతీసుకుంటాడు. బన్నీ అన్న కూతురుగా బేబీ వర్ణిక కనిపిస్తుంది. చిన్నతనం నుంచి గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఆచిన్నారిని ఎలాంటి కష్టం రాకుండా పెంచడానికి హీరో ఏం చేశాడు అనేది ఛల్ ఛల్ ఛలో సాంగ్ లో త్రివిక్రమ్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
ఇక ఆ సాంగ్ లో వర్ణిక నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బూరె బుగ్గలు వేసుకొని.. ముద్దు ముద్దుగా బాబాయ్ ను అది కావాలి.. ఇది కావాలి అని అడుగుతూ కనిపిస్తుంది. ఈ సాంగ్ లో వర్ణికను చూసిన అభిమానులు ఆమె అమాయకమైన ముఖానికి ఫిదా అయిపోయారు. సన్నాఫ్ సత్యమూర్తి వర్ణికకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది.

ఇక ఈ సినిమా తరువాత వర్ణిక..నాన్నకు ప్రేమతో, బంగారు బాబు లాంటి సినిమాల్లో నటించిమెప్పించింది. ఆ తరువాత చదువుకు ప్రాధాన్యత ఇచ్చి ఇండస్ట్రీకి దూరమయ్యింది. అనంతరం ఈ చిన్నదాని ఊసే ఎవరుఎత్తలేదు. సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఎక్కడ ఉన్నా ఫ్యాన్స్ ఇట్టే కనిపెట్టేస్తున్నారు. అలానే తాజాగా బేబీ కనిపెట్టారు. ఇప్పుడు వర్ణిక బేబీకాదు .. టీనేజ్ లోకి వచ్చేసింది. అంతేనా డ్యాన్స్ కూడా అదరగొట్టేస్తుంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 లోని సూసెకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ కు వర్ణిక స్టెప్స్ అదరగొట్టింది. బ్లాక్ నైట్ డ్రెస్ మీద వైట్ కలర్ చున్నీ వేసుకొని నా సామీ స్టెప్స్ అచ్చు దింపేసింది. ఇక ఈ పాపను చూసినవారందరూ.. అరే సన్నాఫ్ సత్యమూర్తి చిన్నారి అప్పుడే ఇంత హాట్ గా మారిపోయిందే .. సూపర్ నాటో కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి వర్ణిక హీరోయిన్ గా మారితే ఏ డైరెక్టర్ ఆమెను పరిచయం చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











