రాజమౌళి క్యూట్ లవ్ స్టోరి.. జక్కనతో రమా రాజమౌళి ప్రేమలో ఎలా పడ్డారో తెలుసా?
దర్శక ధీరుడు జక్కన్న తెలుగు సినిమా కీర్తి కిరీటాన్ని ఆస్కార్ దాకా తీసుకెళ్లారు. నెక్స్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెలుగు సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా జక్కన్న ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుగు సినీ ప్రియులకు బాగా తెలుసు. కానీ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఇంతకీ రాజమౌళి తన భార్య రమా రాజమౌళి ప్రేమలో ఎలా పడిపోయారు? అనే అందమైన లవ్ స్టోరీని మనం కూడా తెలుసుకుందాం.
రమా రాజమౌళి అనగానే రాజమౌళి భార్య అని టక్కున గుర్తొస్తుంది ఎవరికైనా. అయితే ఆమె సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పని చేస్తారు. రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు రమా రాజమౌళినే కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. ఆమె కేవలం కాస్ట్యూమ్ డిజైనర్ మాత్రమే కాదు నటి, డ్యాన్సర్ కూడా.

ఇక గతంలో అమృతం సీరియల్ లో ఆర్టిస్టుగా కొన్ని ఎపిసోడ్స్ లో మెరిసారు ఆమె. అంతేకాకుండా చిన్నప్పుడు రమా రాజమౌళి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారట. ఇన్ని టాలెంట్స్ ఉన్నప్పటికీ ఆమె మెయింటైన్ చేసే సైలెన్స్ చూస్తే ఎవ్వరికీ అలా అనిపించదు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా.
ఇక మొత్తానికి రాజమౌళి, రమా రాజమౌళి ఇద్దరూ ఆదర్శ దంపతులు అని చెప్పొచ్చు. అయితే అప్పట్లోనే వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రమా తామిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనే విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి రాజమౌళిని పెళ్లి చేసుకోవడానికంటే ముందే రమా వేరే వ్యక్తిని పెళ్ళాడింది. రమ మొదటి భర్త కొడుకే కార్తికేయ . అయితే అభిప్రాయ బేధాల వల్ల ఆమె తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత కీరవాణి కారణంగా వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
రమా చెల్లెలు వల్లిని కీరవాణి పెళ్లాడారు. అయితే కీరవాణికి రాజమౌళి స్వయానా తమ్ముడు వరుస కావడంతో వీళ్ళిద్దరికీ వరుస ఏర్పడింది. శాంతి నివాసం సీరియల్ టైం నుంచే రాజమౌళి, రమకు మధ్య మంచి పరిచయం ఉండేదట. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమా టైంలో వీళ్ళిద్దరి మధ్య అప్పటిదాకా ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారిందట. ఇంకేముంది పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రమా రాజమౌళి వెల్లడించారు. తమదేమంత పెద్ద లవ్ స్టోరీ కాదని, కానీ ఇద్దరి మధ్య పెద్దగా తేడాలేమీ లేవని, ఇద్దరి ఒపీనియన్స్ 99 శాతం ఒక్కటేనని చెప్పుకొచ్చారు రమా.
కేవలం సినిమాల విషయంలోనే ఆ ఒక్క పర్సెంట్ తేడా ఉంటుందని రామా రాజమౌళి చెప్పుకొచ్చింది. ఇక వీళ్లిద్దరి మధ్య ఎంత గాఢమైన అనుబంధం ఉందంటే రమకు అప్పటికే కొడుకు కార్తికేయ ఉండగా, రాజమౌళి మళ్లీ పిల్లల కావాలని కోరుకోలేదట. అంతేకాకుండా మయూఖ అనే పాపను దత్తత తీసుకున్నారు ఈ జంట. సినిమాల పరంగానే కాకుండా జీవితంలో కూడా రాజమౌళి ఉన్నత విలువలు పాటిస్తారని అనడానికి ఇది నిదర్శనం అని అభిమానులు చెప్పుకొంటారు.


Click it and Unblock the Notifications











