త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టెన్మెంట్ ఆశించొద్దు... ‘అరవింద సమేత’ డిఫరెంట్!
Recommended Video

తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. దర్శకుడు కాకముందే రచయితగా ఆయన పాపులరయ్యారు. డిఫరెంట్ స్టైల్ డైలాగులతో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన రాసే డైలాగుల్లో వాడే ప్రాసలు బాగా పేలేవి. దీంతో పాటు దర్శకుడిగా మారిన తర్వాత కామెడీ సీన్స్ డిజైన్ చేసే తీరు, వినోదం పంచడానికి రాసే ప్రత్యేకమైన సీక్వెన్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేవి. అయితే అన్ని సినిమాలకు ఇలాగే చేస్తే రోటీన్ అవుతుంది. కొన్ని కథలకు ఇలాంటి మసాలా సరిపడదు కూడా. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టెన్మెంట్ ఆశించి వెళ్లే వారు అలాంటివి లేకుంటే నిరాశ పడిన సందర్భాలు సైతం ఉన్నాయి.

‘అరవింద సమేత’లో త్రివిక్రమ్ మార్క్ వినోదం ఉందా?
మరి ‘అరవింద సమేత'లో త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టెన్మెంట్ ఉందా? ప్రాస డైలాగులు పేలాయా? అంటే లేదని చెప్పక తప్పదు. ఇది ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న మూవీ. ఈ కథకు అలాంటి మసాలా దట్టిస్తే సినిమా రుచి తగ్గుతుంది. అందుకే త్రివిక్రమ్ సినిమా టేస్ట్ తగ్గించే ప్రయత్నం చేయలేదు.

అలా చేస్తే మొదటికే మోసం
సీరియస్‌గా సాగే కథలో.... దానికి తగిన విధంగా మసాలా దట్టించాలి. అంతేకానీ గత సినిమాల్లో ప్రేక్షకులు ఇలాంటివి బాగా మెచ్చారు, ఇందులోనూ అలాంటి సీన్లు జోడిద్దామనే ఆలోచన చేస్తే మొదటికే మోసం వస్తుంది. కథలో ఫ్లో దెబ్బతింటుంది.

త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టెన్మెంట్ ఆశించొద్దు
‘అరవింద సమేత' చిత్రానికి కేవలం త్రివిక్రమ్ మార్క్ ఎంటర్మెంట్ ఆశించి వెళ్లొద్దు. మాస్ హీరో ఎన్టీఆర్, త్రివిక్రమ్ లాంటి తెలివైన దర్శకుడు, రచయిత కలిస్తే వచ్చే విభిన్నమైన సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తితో వెళితే పూర్తి సంతృప్తి చెందుతారు అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట.

సినిమా హిట్ ఏ స్థాయిలో ఉంటుంది?
‘అరవింద సమేత' సినిమా హిట్ సినిమా అని తేలిపోయింది. అయితే దాని స్థాయి ఏ రేంజిలో ఉంటుంది? అనేది ఫస్ట్ వీకెండ్ గడిస్తేకానీ చెప్పలేం. యంగ్ టైగర్ తన కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌కు ప్రేక్షకుల ఏ స్థాయిలో కనెక్ట్ అవుతారో అనేదాన్ని బట్టి సినిమా హిట్ రేంజ్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











