‘భారీ’ నిర్మాతను కూడా పరుగులు పెట్టించాడే.. దేవీ మామూలోడు కాదు!!

తెలుగు నిర్మాతల్లో ఆకారంలోగానీ, నిర్మాణంలోగానీ, మంచితనంలో గానీ భారీ స్థాయిలో ఉండేది బీవీఎస్ఎన్ ప్రసాద్. ఆయన చిత్రాలు ఎంత రిచ్‌గా ఉంటాయో ఆయన మనసు కూడా అంతే రిచ్‌గా ఉంటాయి. ఆయనకు సంతోషం కలిగితే ఎంత చిన్న పిల్లవాడిగా మారిపోతాడో రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నిరూపించాడు. అసలే చిన్న పిల్ల వాడి చేత కూడా స్టెప్పులు వేయించే దేవీ.. నిర్మాతతో వేయించడా. నేడు (ఆగస్టు 13) బీవీఎస్ఎన్ ప్రసాద్ బర్త్ డే సందర్భంగా పాత వీడియోను షేర్ చేశాడు దేవీ.

చత్రపతి, నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ కొట్టాడు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. సినిమాను క్వాలిటీగా తెరకెక్కించేందుకు డబ్బును నీళ్లలా వాడే నిర్మాతల్లో బీవీఎస్ఎన్ ఒకరు. అందుకే ఏ మాత్రం రాజీ పడకుండా ఆయన నిర్మించే చిత్రాల్లో ఆ రిచ్ నెస్ తెరపై అందరికీ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది వంటి సినిమాలను చూస్తేనే ఆయన స్థాయి ఏంటో తెలుస్తుంది.

 DSP Shared A Special Video On BVSN prasad Birthday

నేడు ఆయన బర్త్ డే సందర్భంగా దేవీ శ్రీ ప్రసాద్ పాత వీడియోను షేర్ చేశారు. నాన్నకు ప్రేమతో సినిమాలో భాగంగా ఐ వన్నా ఫాలో ఫాలో సాంగ్‌ను ఎన్టీఆర్ పాట పాడుతుండగా స్టూడియో జరిగిన దృశ్యాన్ని నేడు బయటపెట్టాడు. అందులో నిర్మాత ప్రసాద్ కూడా ఎంతో చలాకీగా ఎన్టీఆర్, దేవీలతో పాటు చిన్నగా స్టెప్పులు వేశారు.

ఫాలో అవుతున్నట్టు ఒకరి చుట్టూ ఒకరు చక్కర్లు కొట్టారు. ఈ వీడియోను దేవీ షేర్ చేస్తూ.. 'ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్వీటెస్ట్ పర్సన్ అయిన భోగవల్లి ప్రసాద్ సర్‌కు హ్యాపీ మ్యూజికల్ బర్త్ డే.. ఆయనలోనూ ఓ పసివాడు ఉన్నాడు. అందువల్లే ఆయన ప్రేమలో పడిపోతారు అందరూ. లవ్యూ సర్.. మనం ఎప్పుడూ ఇలాగే డ్యాన్స్ చేస్తుండాల'ని కోరుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X