హీరో నిఖిల్ సంచలన కామెంట్స్... విజయ్ దేవరకొండను ఉద్దేశించేనా?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. ఈ ట్వీట్ ద్వారా మరో యంగ్ హీరోకు నిఖిల్ క్లాస్ పీకినట్లు గోచరిస్తోంది. అయితే నిఖిల్ అక్కడ పలానా వ్యక్తి పేరు అని ప్రస్తావించక పోయినా... ఇది సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిందే అని అంతా భావిస్తున్నారు. ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
నిఖిల్ చేసిన ఈ ట్వీట్ మీద నెటిజన్స్ భారీగా స్పందించారు. కొందరు నేరుగా నిఖిల్‌కు మద్దతు తెలుపగా, మరికొందరు విజయ్ దేవరకొండకు సపోర్టుగా కామెంట్స్ చేశారు. ఇంతకీ నిఖిల్ చేసిన కామెంట్స్ ఏమిటో ఓ లుక్కేద్దాం.
నిఖిల్ సంచలన ట్వీట్
ఈ ప్రపంచం తన చుట్టూ తిరుగుతుందని భావిస్తున్న వారిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేస్తున్నాను. వారు అనవసరమైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ నువ్వు అంత ముఖ్యమైన వాటివి కాదు. ప్రతి నటుడు తనతో తాను పోటీ పడాలి. మనం అంతా సినిమా అనే సముద్రంలోకి తోసివేయబడతాం. ఇక్కడ హైప్ తక్కువ ప్రదర్శించాలి, పని ఎక్కువ చేయాలి... అని నిఖిల్ ట్వీట్ చేశారు.
నువ్వు ఎన్ని హిట్స్ కొట్టినా అక్కడే ఉన్నావు కదా
నిఖిల్ చేసిన ట్వీట్ మీద ఓనెటిజన్ స్పందిస్తూ.... అతడికి ఈ సినిమా పోయినా ఏదో ఒక సినిమా గట్టిగా కొట్టి టాప్ లెవల్‌కు వెళతాడు. నువ్వు ఎన్ని హిట్స్ కొట్టినా అక్కడే ఉన్నావ్. బర్నాల్ కానీ ఈనో కానీ తీసుకో అంటూ రిప్లై ఇచ్చారు.
నిఖిల్ ఎన్నో ఎక్స్‌పర్మెంట్స్ చేశాడు
నిఖిల్ చాలా ప్రయోగాత్మక సినిమాలు చేశాడు. ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు... ఇతరులతో అతడిని పోల్చొద్దు అంటూ కొందరు నెటిజన్స్ నిఖిల్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.
మూడు సినిమాలతో 100 కోట్లు కొట్టాడు
నిఖిల్ 10 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నా పెద్దగా ఏమీ సాధించలేదు. విజయ్ దేవరకొండ మూడు సినిమాలతో 100 కోట్లు కొట్టాడంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











