నిహారిక, నాగబాబుకు ఊహించిన ఫలితం: బాపుబొమ్మ విషయంలో ‘అనుకున్నదొకటి అయిందొకటి’!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది వారసులు తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో దాదాపుగా హీరోలే ఉండగా, మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఓ హీరోయిన్ కూడా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె.. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. సినీ ప్రముఖులు పరిశ్రమకు హీరోలను అందిస్తే... నాగబాబు ఒక్కరే తన కూతురితో ఎంట్రీ ఇప్పించారు. అంతేకాదు, ఆమెతో ఎన్నో రకాల ప్రయోగాలు కూడా చేయించారు. ఇక, ఇటీవలే మెగా ప్రిన్సెస్‌కు పెళ్లి సంబంధం కూడా కుదిర్చారు. ఇలాంటి సమయంలో ఈ తండ్రీ కూతుళ్లకు భారీ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే....

అలా ఎంట్రీ ఇచ్చింది.. సక్సెస్ అయింది
నిహారిక... వెండితెరపైకి వచ్చే ముందే.. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ' ద్వారా బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీనికి దాదాపు రెండు సీజన్ల పాటు హోస్ట్ చేసిన ఆమె... ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత కొనసాగే ఛాన్స్ ఉన్నప్పటికీ.. ఎందుకో ఈ షోతో పాటు బుల్లితెర నుంచి గ్యాప్ తీసుకుందీ మెగా ప్రిన్సెస్.

మరో రెండు ప్రయోగాలు.. అన్నీ హిట్టే
బుల్లితెరపై మెప్పించిన నిహారిక... నటన మీద ఉన్న ఆసక్తితో యూట్యూబ్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. వాటిలో అదరగొట్టడంతో... వెబ్ సిరీస్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘పింక్ ఎలిఫెంట్స్' పేరిట సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ‘ముద్దపప్పు అవకాయ్', ‘నాన్న కూచి' సహా ఎన్నో వెబ్ సిరీస్‌లు చేసి సూపర్ సక్సెస్ అయిందీ బ్యూటీ.

అందులో మాత్రం అన్నీ ఎదురుదెబ్బలే
బుల్లితెర యాంకర్‌గా ఎంతగానో మెప్పించి... వెబ్ సిరీస్‌లలో సైతం ఆకట్టుకున్న నిహారిక... సినిమాల్లో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయింది. ‘ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె... ఆ తర్వాత వరుసగా ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి చిత్రాల్లో నటించింది. అయితే, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ ముందు భారీ పరాజయాలను చవి చూశాయి.

పెళ్లి కూతురు కాబోతున్న మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. ఓ పోలీస్ అధికారి కుమారుడు, యువ వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే వీళ్లకు ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు కొందరు మాత్రమే హాజరయ్యారు. ఇక, వీరి వివాహం ఈ డిసెంబర్‌లో జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అక్కడ నిహారిక, నాగబాబుకు భారీ షాక్
త్వరలోనే ఏడు అడుగులు వేయబోతున్న తన కూతురు నిహారిక కోసం నాగబాబు అదిరిపోయే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. అదే ‘బాపు బొమ్మకు పెళ్లంట'. వినాయక చవితి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం జీ తెలుగులో ప్రసారం అయింది. ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తుందనుకుంటే దానికి భిన్నంగా జరిగిందట.
Recommended Video

బాపుబొమ్మ విషయంలో తప్పని నిరాశ
వినాయక చవితి రోజే ఈటీవీలో ‘2020 అనుకున్నది ఒకటి అయింది ఒకటి' అనే ప్రోగ్రామ్ కూడా వచ్చింది. దీనికి జబర్ధస్త్ సెలెబ్రిటీలతో పాటు బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లు సైతం హాజరయ్యారు. అలాగే, హీరో సునీల్, రోజా తదితరులు వచ్చారు. ఈ ఈవెంట్‌కు 13 పైచిలుకు రేటింగ్ వచ్చిందట. ‘బాపు బొమ్మ'ది మాత్రం పది లోపే ఉన్నట్లు తాజా రేటింగ్స్ ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











