రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న ‘F3’: ఏకంగా ఆ రెండింటికే రూ. 24 కోట్లు రాబడి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల శకం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మధ్య ఎక్కువగా ఆ తరహా చిత్రాలు వస్తుండడమే. ప్రేక్షకుల అభిరుచిలో మారడంతో పాటు హీరోల ఫ్యాన్స్ ఆలోచనా ధోరణిలోనూ మార్పులు వచ్చాయి. ఈ కారణంగానే మల్టీస్టారర్ మూవీలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇలా వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో 'F2' ఒకటి. దీనికి కొనసాగింపుగా 'F3'ని తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. పట్టాలపై ఉన్న ఈ మూవీ అప్పుడే రికార్డులను క్రియేట్ చేస్తోంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో వచ్చిన చిత్రమే ‘F2’

ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌తో వచ్చిన చిత్రమే ‘F2’

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించాడు అనిల్ రావిపూడి.

అంచనాలు లేకుండానే అదరగొట్టేసిందిగా

అంచనాలు లేకుండానే అదరగొట్టేసిందిగా

రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) విడుదలైంది. ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి సెలవుల్లో హవాను చూపిస్తూ ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. ఆ ఏడాది విడుదలైన సినిమాలు అన్నింటిలోనూ ఎక్కువ లాభాలు దీనికే వచ్చిన విషయం తెలిసిందే.

అనుకున్నట్లే.. సీక్వెల్‌ను మొదలెట్టేశారు

అనుకున్నట్లే.. సీక్వెల్‌ను మొదలెట్టేశారు

'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సూపర్ డూపర్ హిట్ అవడంతో, దీనికి సీక్వెల్‌ను తీయాలని డిసైడ్ అయింది చిత్ర యూనిట్. గత ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' వంటి బడా హిట్‌ను అందుకున్న అనిల్ రావిపూడి.. లాక్‌డౌన్ సమయంలో ఈ కథను సిద్ధం చేశాడు. ఇందులో భాగంగానే 'F3' పేరిట ఈ సినిమాను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా ప్రారంభించేశారు.

ఇందులో ముగ్గురు హీరోలంటూ ప్రచారం

ఇందులో ముగ్గురు హీరోలంటూ ప్రచారం


'F2'లో ఇద్దరు హీరోలు నటించడంతో, దానికి సీక్వెల్‌గా రాబోతున్న 'F3'లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సహా ముగ్గురు స్టార్లు ఉంటారని జోరుగా ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే మాస్ మహారాజ రవితేజ, రామ్, సాయి ధరమ్ తేజ్ సహా ఎంతో మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లతో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

‘F3’ స్టోరీ లైన్‌పై క్లారిటీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

‘F3’ స్టోరీ లైన్‌పై క్లారిటీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇక, దీన్ని ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.

రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న ‘F3’

రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న ‘F3’

మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో.. 'F3'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ రూ. 12 కోట్లకు, డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ. 12 కోట్లకు కొనుగోలు చేశాయి. దీంతో ఈ రెండింటికే ఏకంగా రూ. 24 కోట్లు నిర్మాత ఖాతాలో పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X